Site icon NTV Telugu

Ashok Galla: మహేశ్ మేనల్లుడు మాస్ అవతారం ఎత్తాడు…

Ashok Galla

Ashok Galla

జయదేవ్ గల్లా కొడుకు, సూపర్ స్టార్ మహేశ్ బాబు మేనల్లుడిగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు అశోక్ గల్లా. మొదటి సినిమా ‘హీరో’తోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న అశోక్ గల్లాకి ఘట్టమనేని అభిమానుల నుంచి మంచి సపోర్ట్ లభించింది. హీరోతో తన డాన్స్ అండ్ యాక్టింగ్ స్కిల్స్ ప్రూవ్ చేసుకున్న అశోక్ గల్లా, సెకండ్ మూవీతో ఆడియన్స్ ని పలకరించడానికి రెడీ అయ్యాడు. అర్జున్ జంద్యాల దర్శకత్వంలో ప్రశాంత్ వర్మ కథతో ఈ సినిమా తెరకెక్కుతుంది. గుణ 369 సినిమాతో కమర్షియల్ హిట్ కొట్టిన అర్జున్, అశోక్ గల్లాని మాస్ హీరో అవతరంలోకి మార్చాడు. అశోక్ గల్లా పుట్టిన రోజు కావడంతో ఈ మూవీ నుంచి ఒక స్పెషల్ వీడియోని మేకర్స్ రిలీజ్ చేశారు.

Read Also: Rajinikanth: ‘లియో’ బ్రేక్ లో రజినీతో లోకేష్ మీటింగ్… ఈ కాంబోని తట్టుకోవడం కష్టం

విలేజ్ సెటప్ లో ఉన్న గుడి దగ్గర వాటర్ స్పోర్ట్స్ ఆడుతున్నట్లు డిజైన్ చేసిన యాక్షన్ ఎపిసోడ్ లో అశోక్ గల్లా లుక్ ని రివీల్ చేశారు. మీసం తిప్పుతూ అశోక్ గల్లా చాలా మాస్ గా కనిపించాడు. ప్రశాంత్ వర్మ కథ ఇచ్చాడు అంటే అందులో పక్కా విషయం ఉంటుంది కాబట్టి సినిమాని బాగా ఎగ్జిక్యూట్ చేస్తే అశోక్ గల్లాకి కమర్షియల్ ఇవ్వడానికి ఘట్టమనేని అభిమానులు రెడీగా ఉన్నారు. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్, భీమ్స్ మ్యూజిక్ ఇస్తున్న ఈ సినిమాకి టైటిల్ ఏంటి? హీరోయిన్ ఎవరు? ఎప్పుడు రిలీజ్ చేస్తారు లాంటి డీటెయిల్స్ తెలియాల్సి ఉన్నాయి.

Exit mobile version