Site icon NTV Telugu

Prashanth Varma: క్రియేటివ్ డైరెక్టర్ కథతో ఘట్టమనేని ఫ్యామిలీ హీరో

Ashok Galla 2

Ashok Galla 2

‘హీరో’ సినిమాతో ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు ‘అశోక్ గల్లా’. మొదటి సినిమాతోనే కుర్రాడు బాగున్నాడు, చాలా యాక్టివ్ గా ఉన్నాడు అనే పేరు తెచ్చుకున్న అశోక్ గల్లా కొత్త సినిమా లాంచ్ అయ్యింది. క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకోని పాన్ ఇండియా సినిమాలని తెరకెక్కిస్తున్న ప్రశాంత్ వర్మ స్క్రిప్ట్ తో, శ్రీలలితాంబిక ప్రొడక్షన్స్ బ్యానర్ లో అశోక్ గల్లా నెక్స్ట్ సినిమా స్టార్ట్ అయ్యింది. ప్రశాంత్ కథని అరుణ్ జంద్యాల డైరెక్ట్ చేస్తున్నాడు. కార్తికేయ గుమ్మికొండ నటించిన ‘గుణ 369’ సినిమాని అరుణ్ జంద్యాల డైరెక్ట్ చేశాడు. ఈ మూవీ యావరేజ్ గా నిలిచింది. దాదాపు రెండేళ్ల తర్వాత అరుణ్ జంద్యాల, అశోక్ గల్లా సినిమా చేస్తున్నాడు. ఈ మూవీకి భీమ్స్ మ్యూజిక్ ఇస్తుండగా, సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్నాడు.

Read Also: Salaar Makers: హోంబెల్ నుంచి మరో పవర్ ఫుల్ యాక్షన్ సినిమా…

ఈ మూవీ గ్రాండ్ లాంచ్ ఈవెంట్ కి విక్టరీ వెంకటేష్, నమ్రత, బోయపాటి శ్రీను, మిర్యాల రవీందర్ లు చీఫ్ గెస్టులుగా వచ్చారు. ప్రశాంత్ వర్మ కథ అనగానే ఆడియన్స్ లో అంచనాలు పెరుగుతాయి, ఆ అంచనాలకి తగ్గట్లే ఈ కొత్త మూవీ అనౌన్స్మెంట్ పోస్టర్ లో కూడా వారణాసి బ్యాక్ డ్రాప్ ఫోటోలు, జోడియాక్ సైన్ లు ఉన్నాయి. మరి ప్రశాంత్ వర్మ, అశోక్ గల్లాకి ఎలాంటి స్క్రిప్ట్ ని రెడీ చేశాడు? ఈ మూవీతో హీరోగా అశోక్ గల్లా సెట్ అయిపోతాడా అనేది చూడాలి.

Read Also: Adah Sharma : అందాలతో కుర్రాళ్లను ఫిదా చేస్తున్న అదా

Exit mobile version