Site icon NTV Telugu

Kichcha Sudeep: సుదీప్ ప్రైవేట్ వీడియోలు.. తీసింది అతనే ..?

Sudeep

Sudeep

Kichcha Sudeep: ఈగ సినిమాతతో తెలుగువారికి కూడా సుపరిచితుడుగా మారిపోయాడు కన్నడ నటుడు సుదీప్. ఇక విక్రాంత్ రోణ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన సుదీప్ రాజకీయ రచ్చ కన్నడ ఇండస్ట్రీని కుదిపేస్తోంది. గత కొన్ని రోజులుగా సుదీప్ పొలిటికల్ ఎంట్రీ హీట్ తెప్పిస్తోంది. ఈ మధ్యనే ఈయన సీఎం బసవరాజు బొమ్మైను కలిసి ఆయన తరుఫున ప్రచారం చేస్తున్నట్లు తెలిపిన సంగతి తెల్సిందే. ఇక ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో అప్పటి నుంచు సుదీప్ కు బెదిరింపు లేఖలు మొదలయ్యాయి. సుదీప్ కనుక బీజేపీ లో చేరితే తన ప్రైవేట్ వీడియోలను లీక్ చేస్తామని, బహిరంగంగా అతని ప్రైవేట్ వీడియోలు, ఫోటలను పంచుతామని ఆ లేఖలో రాశారు. అసలు సుదీప్ ను అంత డీప్ గా ఫాలో అయినవారు ఎవరు..? బీజేపీకు మద్దతు తెలిపితే వారికేంటి సంబంధం అని అనేక ప్రశ్నలు మొదలయ్యాయి. ఇక ఈ విషయం తెలియడంతో సీఎం బసవరాజు బొమ్మై సీరియస్ అయ్యారు. తానే స్వయంగా ఈ కేసును సీసీబీ కి అప్పగించినట్లు తెలుస్తోంది.

Akshara Singh: హీరోయిన్ ప్రైవేట్ వీడియో లీక్.. సిగ్గు లేదా ఇలాంటివి చేయడానికి

ఇక ఈ కేసులో పోలీసులు సుదీప్ కారు డ్రైవర్ ను అనుమానిస్తున్నట్లు సమాచారం. ఈ మధ్యనే సుదీప్ తన కారు డ్రైవర్ ను పనిలో నుంచి తీసేశాడు. తనను ఉద్యోగంలోంచి తీసేశారనే కోపంతోనే మాజీ కారు డ్రైవర్ ఈ అఘాయిత్యానికి ఒడిగట్టి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. నిత్యం సుదీప్ తో ఉండే కారు డ్రైవరే ఇలాంటి పని చేసి ఉండొచ్చని అంటున్నారు. అంతేకాకుండా ఈ అనుమానాలకు ఆజ్యం పొసే విధంగా కారు డ్రైవర్ ఫోన్ స్విచాఫ్ రావడం, అతడు కనపడకుండా పోవడంతో ఇది అతని పని అయ్యి ఉంటుందని చెప్పుకొస్తున్నారు. ఇంకోపక్క సుదీప్ బీజేపీ లో చేరడం ఇష్టంలేనివారు కూడా ఈ పని చేసి ఉండొచ్చని, కారు డ్రైవర్ దొరికితే అన్ని బయటపడతాయి అని అంటున్నారు. ప్రస్తుతం కారు డ్రైవర్ కోసం బెంగుళూరు పోలీసులు గాలిస్తున్నారు. త్వరలోనే అతడిని పట్టుకొని నిజానిజాలు బయటపెట్టనున్నట్లు పోలీసులు తెలుపుతున్నారు.

Exit mobile version