Site icon NTV Telugu

ముంబై కోర్టులో ఆర్యన్‌ ఖాన్‌కు ఎదురుదెబ్బ

డ్రగ్స్ కేసులో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్‌కు ముంబై కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆర్యన్‌ఖాన్‌ బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేయగా.. కస్టడీ ముగిసిన తరువాత కోర్టులో హాజరుపరిచింది ఎన్సీబీ.. ఆయన బెయిల్‌ పిటిషన్‌ ను కోర్టు పారేస్తూ.. 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. ఆర్యన్‌ ఖాన్‌ తో పాటు 7 గురిని.. జ్యుడీషియల్ కస్టడీకి పంపారు.

ఆర్యన్‌ ఖాన్‌ను ఇన్నిరోజులు పాటు విచారించిన అవసరంలేదంటూ ఆయన తరుపున న్యాయవాది చెప్పిన కోర్టు తోసిపుచ్చింది. మరింత లోతుగా విచారణ జరపాలన్న ఎన్సీబీ అభ్యర్థనను కోర్టు పరిగణలోకి తీసుకుంది. దీంతో 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.

కాగా ఆర్యన్‌ డ్రగ్స్ కేసులో షారుఖ్‌ ఇంతవరకూ స్పందించలేదు. ఆర్యన్‌ డ్రగ్స్ తీసుకుంటున్నట్టు విచారణలో తేలిదంటూ ప్రచారం జరుగుతోన్న ఆయన మాట్లాడానికి ఇష్టపడటం లేదు. దీంతో సంచలనంగా మారిన డ్రగ్స్ కేసులో ఇప్పుడు ఏం జరగబోతోందన్న ఉత్కంఠ నెలకొంది.

Exit mobile version