Site icon NTV Telugu

Arya: కమర్షియల్ సినిమాలు చేయడం ఛాలెంజ్ లాంటిది.. రామ్‌కు ఇది అలవాటే

Hero Arya

Hero Arya

రామ్ హీరోగా నటించిన ది వారియర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ చెన్నైలోని సత్యం థియేటర్‌లో ఘనంగా జరుగుతోంది. ఈ కార్యక్రమానికి తమిళ హీరోలందరూ తరలివచ్చారు. విశాల్, ఆర్య, కార్తీ, మణిరత్నం, భారతీరాజా, ఆర్కే సెల్వమణి, విక్రమన్ వంటి ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరో ఆర్య మాట్లాడుతూ.. దర్శకుడు లింగుసామి తెలుగు, తమిళంలో ది వారియర్ సినిమాను తెరకెక్కించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఆయనకు ఈ సినిమా పెద్ద హిట్ అందించాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆర్య మాట్లాడాడు. అటు హీరో రామ్‌పై ఆర్య ప్రశంసలు కురిపించాడు.

సాధారణంగా కమర్షియల్ సినిమాల్లో నటించడం ఛాలెంజ్ లాంటిదని.. కానీ రామ్ తన కెరీర్‌లో చాలావరకు కమర్షియల్ సినిమాల్లోనే నటించి హిట్లు అందుకున్నాడని కొనియాడాడు. అందుకే తనకు హీరో రామ్‌కు పెద్ద ఫ్యాన్‌ను అని ఆర్య వెల్లడించాడు. రామ్ 19 సినిమాల్లో నటించినా కొత్త సినిమాలో నటించిన మాదిరి కనిపిస్తుంటాడని… రామ్ ఫెంటాస్టిక్ యాక్టర్ అని.. అతడు మంచి డ్యాన్సర్, ఫైటర్ అని ఆర్య ప్రశంసలు కురిపించాడు. దేవిశ్రీప్రసాద్ గురించి తాను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని.. ఈ సినిమాలో బుల్లెట్ సాంగ్ తనకు ఎంతగానో నచ్చిందన్నాడు. ఈ సినిమాలో ఆదిపినిశెట్టి విలన్‌గా నటించడం తనను ఆశ్చర్యపరిచిందన్నాడు. అతడి కాంబినేషన్‌లో తనకు కూడా సినిమా చేయాలని ఉందన్నాడు. హీరోయిన్ కృతిశెట్టికి ఈ సినిమా మంచి సక్సెస్ అందించాలని ఆర్య ఆకాంక్షించాడు.

https://www.youtube.com/watch?v=orOyk8gsFAU

Exit mobile version