Ghamasaan OTT: అర్షద్ వార్సీ, ప్రతీక్ గాంధీ ఢీ.. అదరగొట్టిన ‘ఘమాసాన్’ ట్రైలర్ .. నేరుగా ఓటీటీలోకే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ghamasaan OTT: బలమైన కథ, పవర్ఫుల్ పాత్రలు, గ్రే షేడ్స్ క్యారెక్టర్లతో ఓటీటీలోకి మరో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బాలీవుడ్ నటులు అర్షద్ వార్సీ, ప్రతీక్ గాంధీ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఘమాసాన్’ (Ghamasaan) ట్రైలర్ తాజాగా విడుదలైంది. ప్రముఖ దర్శకుడు టిగ్మాన్షు ధూలియా తెరకెక్కించిన ఈ సినిమా ట్రైలర్ అధికారం, రాజకీయాలు, రివేంజ్ చుట్టూ సాగే రఫ్ అండ్ గ్రిప్పింగ్ ప్రపంచాన్ని పరిచయం చేస్తోంది. ఈ క్రైమ్ యాక్షన్ డ్రామా ట్రైలర్‌ను యూట్యూబ్, సోషల్ మీడియా వేదికల ద్వారా వీక్షకుల ముందుకు తీసుకొచ్చారు. బుందేల్‌ఖండ్ అడవుల నేపథ్యంలో ఒక పవర్ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ ఆదిత్య (ప్రతీక్ గాంధీ), మోస్ట్ వాంటెడ్ డకాయిట్ మహరాజ్ (అర్షద్ వార్సి)ల మధ్య సాగే రఫ్ అండ్ గ్రిప్పింగ్ పవర్ పాలిటిక్స్ మ్యాచ్‌ను ఈ ట్రైలర్లో కళ్లకు కట్టినట్లు చూపించారు.
విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న ఈ రా అండ్ రస్టిక్ మూవీలో అసలు ఆసక్తికరమైన అంశం అర్షద్, ప్రతీక్ మధ్య జరిగే పోరాటమే. సాధారణంగా పోలీస్, నేరస్థుడి మధ్య జరిగే ఘర్షణలా కాకుండా, ఇద్దరి మధ్య పోరు ఒక పెద్ద వ్యవస్థపై నియంత్రణ కోసం జరిగే యుద్ధంగా మారుతున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఇక రిలీజ్ విషయానికి వస్తే.. ‘ఘమాసాన్’ 2026 సెప్టెంబర్ 11 నుంచి జీ5 (ZEE5)లో ఎక్స్‌క్లూజివ్‌గా స్ట్రీమింగ్ కానుంది. థియేట్రికల్ రిలీజ్ కాకుండా నేరుగా ఓటీటీలోకి తీసుకొస్తున్నారు మేకర్స్. క్రైమ్, పొలిటికల్ థ్రిల్లర్ తరహా కంటెంట్‌ను చూడాలనుకునే వారికి ఈ సినిమా మంచి ఆప్షన్‌గా నిలిచే అవకాశం ఉంది. అర్షద్ వార్సీ, ప్రతీక్ గాంధీ వంటి నటుల మధ్య జరిగే పవర్ గేమ్‌కు టిగ్మాన్షు ధూలియా టేకింగ్ తోడైతే ‘ఘమాసాన్’ ఓటీటీలో ఎలాంటి స్పందన అందుకుంటుందో చూడాలి. ఇది బుందేల్‌ఖండ్ అడవుల నేపథ్యంలో ఒక పవర్ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్, ఒక మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ మధ్య సాగే మైండ్ గేమ్ కథాంశంతో రూపొందింది.
Also Read
‘ఘమాసాన్’లో ప్రత్యేకత ఏమిటంటే.. ఇందులో పూర్తిగా మంచి హీరో, చెడ్డ విలన్ అంటూ పాత్రలను విభజించలేదని మేకర్స్ చెబుతున్నారు. ప్రతి పాత్రలోనూ మంచి, చెడు కలగలిసిన గ్రే షేడ్స్ ఉండబోతున్నాయి. ఒక సందర్భంలో సరైనదిగా కనిపించే నిర్ణయం మరో సందర్భంలో తప్పుగా అనిపించేలా కథ సాగుతుందని తెలుస్తోంది. దీంతో అసలు హీరో ఎవరు, విలన్ ఎవరు అనే విషయం సీట్ ఎడ్జ్ కు తీసుకెళ్తుందని మేకర్స్ చెబుతున్నారు. టిగ్మాన్షు ధూలియా గతంలోనూ రా అండ్ రియలిస్టిక్ కథలను తనదైన శైలిలో తెరకెక్కించారు. అదే తరహాలో ‘ఘమాసాన్’ కూడా ఎలాంటి గ్లామర్‌కు ప్రాధాన్యత ఇవ్వకుండా కథ, పాత్రలు, వాటి మధ్య సంఘర్షణల ఆధారంగా సాగనున్నట్లు ట్రైలర్ సూచిస్తోంది. ముఖ్యంగా అర్షద్ వార్సీ, ప్రతీక్ గాంధీ తమ పాత్రల్లో చూపించిన ఇంటెన్సిటీ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
ఈ సినిమాను జీ5, జియో స్టూడియోస్, గోల్డెన్ రేషియో ఫిల్మ్స్ సంయుక్తంగా రూపొందించాయి. జ్యోతి దేశ్‌పాండే, పీయూష్ సింగ్, అభయానంద్ సింగ్, సౌరభ్ గుప్తా, అశ్విని చౌదరి, మితెన్ షా నిర్మాతలుగా వ్యవహరించారు. ఇప్పటికే ‘ఘమాసాన్’ మామి ముంబై ఫిల్మ్ ఫెస్టివల్, సినీవెంచర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, చికాగో సౌత్ ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్ వంటి ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమైంది. సెప్టెంబర్ 11న ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ దక్కించుకుంటుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
తాజావార్తలు
-
Papikondalu Boat Rides Break : పాపికొండల యాత్రకు మళ్లీ బ్రేక్.. బోటు షికార్లు బంద్.!
-
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి సాధనకు సీఎం రేవంత్ రెడ్డి భగీరథ యజ్ఞం..
-
PAK vs ENG: షాదాబ్ ఖాన్ సంచలన ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ పై పాక్ థ్రిల్లింగ్ విక్టరీ..!
-
Prabhas: నెక్స్ట్ ఇయర్ డార్లింగ్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్.. బాక్సాఫీస్ ఇక షేకే!
-
IND W vs ZIM W: జింబాబ్వే పై భారత్ విజయం.. సిరీస్ కైవసం..!
ట్రెండింగ్
-
Fake Note Printing : వామ్మో.. అద్దెకు డబ్బులు లేక.. కరెన్సీ నోట్లే అచ్చేశాడు..
-
Temple Style Daddojanam: టెంపుల్ స్టైల్ “దద్దోజనం” కావాలా నాయన.. నిమిషాల్లో ఇంట్లోనే ఇలా చేసేసుకోండి..!
-
Surprise For Delivery Boy: డెలివరీ బాయ్‌కి ఊహించని బహుమతి.. ఆనందం చూస్తే కన్నీళ్లు ఆగవు..!
-
Second Hand Car Buying: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా..? ఈ విషయాలు పరిశీలించకపోతే బొక్కబోర్లా పడినట్టే..!
-
Viral Video: పుట్టుకతోనే మీసాలు.. వైరల్ అవుతున్న బేబీ వీడియో..! అసలు నిజమేంటి.?