Around 750 vehicles used in Salaar action sequences: ప్రభాస్ హీరోగా ఇప్పటికే అనేక సినిమాలు లైన్ లో ఉన్నాయి. అయితే వాటిలో అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న సినిమా ఏది అంటే మాత్రం ఖచ్చితంగా సలార్ అని చెప్పాలి. ఎందుకంటే కే జి ఎఫ్ లాంటి సిరీస్ సినిమాలు డైరెక్ట్ చేసిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతూ ఉండడంతో ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉంది కానీ వాయిదాలు వేస్తూ వస్తున్న నేపథ్యంలో మరొక 50 రోజుల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సర్వం సిద్ధమవుతున్నట్లుగా చెప్పుకోవచ్చు. పూర్తిస్థాయి డార్క్ సెంట్రిక్ థీమ్ తో రూపొందుతున్న ఈ సలార్ సినిమాలో ప్రభాస్ రెండు విభిన్నమైన పాత్రలలో కనిపించబోతున్నట్లుగా చెబుతున్నారు.
Aata Sandeep: నన్ను అలానే బయటకు పంపారు.. అంత భయమా.. పల్లవి ప్రశాంత్ పేరు లాగుతూ సందీప్ సంచలనం!
ఇక డిసెంబర్ 22వ తేదీన ఈ సినిమా రిలీజ్ అవుతూ ఉండగా తాజాగా ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన లీక్ బయటకు వచ్చింది. అదేమిటంటే ఈ సినిమాలో ఫైట్ సీక్వెన్స్ ల కోసం దాదాపుగా 750 వాహనాలను వాడినట్లు తెలుస్తోంది. జీపులు, ట్యాంకర్లు, ట్రక్కులు మొత్తం అన్ని కలిపి దాదాపు 750 వాహనాలను కేవలం యాక్షన్ సీక్వెన్స్ ల కోసమే వాడారని అంటున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా ప్రభాస్ కి విలన్ గా పృథ్వీరాజ్ సుకుమారం వరదరాజమన్నార్ అనే పాత్రలో కనిపించబోతున్నారు. ఆయన తండ్రి పాత్రలో జగపతిబాబు మరో కీలకపాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం షూట్ చేసిన దాదాపు అన్ని యాక్షన్ సీక్వెన్స్ హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయని వాటి విఎఫ్ఎక్స్ కోసమే సినిమా వాయిదా వేశారని అంటున్నారు. చూడాలి మరి ఏమవుతుందనేది.