Citizen Vigilante: హింసకు భయపడి జర్మనీ ఆపేసిన సినిమా.. ఎలాన్ మస్క్ ఎంట్రీతో ఒక్కసారిగా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Citizen Vigilante: హాలీవుడ్ నటుడు ఆర్మీ హామర్ నటించిన ‘సిటిజన్ విజిలాంటే’ (Citizen Vigilante) వివాదాల నడుమ వార్తల్లో నిలుస్తోంది. సినిమాలో చూపించిన విపరీతమైన హింస, వలసదారుల కథనంతో ఈ మూవీకి సమస్యలు తెచ్చి పెట్టాయి. జర్మనీలో ఈ సినిమాకు హోమ్ ఎంటర్టైన్మెంట్ సర్టిఫికెట్ నిరాకరించడంతో దర్శకుడు ఉవే బోల్ తీవ్రంగా స్పందించారు. ఆ తర్వాత ఆయన ఎలాన్ మస్క్‌ను ఆశ్రయించడం, మస్క్ జూన్ 25న సినిమాను Xలో 48 గంటల పాటు అందుబాటులో ఉంచడంతో కథ ఒక్కసారిగా మరో మలుపు తిరిగింది.
వివాదాస్పద దర్శకుడు ఉబే బోల్ తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ‘సిటిజన్ విజిలాంటే’ (Citizen Vigilante) జర్మనీలో తీవ్రమైన వివాదాల నడుమ 2026 జూన్ 19న విడుదలైంది. అయితే జర్మనీ సెన్సార్ బోర్డు (FSK) ఈ సినిమాకు Age Rating ఇవ్వడానికి పూర్తిగా నిరాకరించింది. చట్టప్రకారం రేటింగ్ లేని సినిమాలను జర్మనీలో థియేటర్లలో ప్రదర్శించడానికి వీలుండదు. ఈ నిర్ణయంపై దర్శకుడు ఉబే బోల్ జర్మన్ కోర్టును ఆశ్రయించినప్పటికీ, అక్కడ కూడా 6-2 ఓట్ల తేడాతో ఆయనకు వ్యతిరేకంగానే తీర్పు వచ్చింది. ఇంటర్నెట్లో దీనికి విపరీతమైన మద్దతు లభించడంతో బోర్డు పునఃసమీక్ష జరిపింది. చివరకు జూలై 2026లో FSK ఈ సినిమాకి ’18+’ రేటింగ్‌ను ఖరారు చేస్తూ జర్మనీ థియేటర్లలో పెద్దలు చూసేందుకు మాత్రమే అనుమతులు మంజూరు చేసింది.
Also Read
- Dulquer Salmaan: "టైటిల్ రోల్ నాది కాదు.. అయినా ఈ సినిమాకి సైన్ చేశా"
- Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
- Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్‌బీర్ క్వశ్చన్ వైరల్!
- Tollywood: చివరి నిమిషంలో బీజీఎంల మార్పు.. పెద్ద సినిమాల్లో కొత్త తలనొప్పులు!
ఈ వివాదానికి అసలు కారణం ఈ కథే. ఇందులో సాండర్స్ అనే అమెరికన్ పాత్రలో ఆర్మీ హామర్ కనిపించాడు. యూరప్‌లో నివసించే అతడికి ఒక దారుణమైన సంఘటన తర్వాత పోలీసులపై, న్యాయవ్యవస్థపై నమ్మకం పోతుంది. దీంతో నేరస్థులను చట్టం ద్వారా శిక్షించడం సరిపోదని భావించి తానే రంగంలోకి దిగుతాడు. అత్యాచారాలు, హింసాత్మక నేరాలకు పాల్పడిన వారితో పాటు వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని అతడు భావించే అధికారులు, న్యాయమూర్తులను కూడా టార్గెట్ చేస్తాడు. ఈ క్రమంలో అతడి చర్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కొంతమంది అతడిని హీరోగా చూడటం, మరోవైపు పోలీసులు అతడిని ప్రమాదకర నేరస్థుడిగా పరిగణించడం కథలో కీలకంగా మారుతుంది. ఇక్కడి నుంచే సినిమా అసలు వివాదం మొదలవుతుంది. సినిమాలో వలసదారుల పాత్రలను నేరస్థులుగా చూపించడం, ముఖ్యంగా హింసాత్మక నేరాలు చేసే వ్యక్తులుగా చిత్రీకరించడం వల్ల విమర్శలు వచ్చాయి. అదే సమయంలో హీరో చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోవడాన్ని సమర్థించేలా సినిమా ఉందని విమర్శకులు ఆరోపించారు.
ఈ కథకు దర్శకుడు ఉవే బోల్ చెప్పిన మరో నేపథ్యం కూడా ఉంది. 2016లో హాంబర్గ్‌లో జరిగిన ఒక సామూహిక అత్యాచార కేసు తనను ప్రభావితం చేసిందని ఆయన వెల్లడించారు. నేరాలకు పాల్పడిన వారికి విధించిన శిక్షలపై అప్పట్లో జరిగిన చర్చ తన ఆలోచనలను ప్రభావితం చేసిందని బోల్ పేర్కొన్నారు. అయితే సినిమా పూర్తిగా ఆ ఘటనకు సినిమా రూపం కాదని, దాని చుట్టూ ఉన్న సామాజిక, రాజకీయ ఆగ్రహాన్ని తన కథలో ఉపయోగించుకున్నట్లు ఆయన వివరిస్తున్నారు.
ఇదే సమయంలో దర్శకుడు ఉవే బోల్ తన సినిమాపై వచ్చిన ఆంక్షలను సెన్సార్‌షిప్‌గా అభివర్ణిస్తూ ఎలాన్ మస్క్‌ను బహిరంగంగా సంప్రదించారు. మస్క్ స్పందిస్తూ జూన్ 25, 2026న ‘Citizen Vigilante’ పూర్తి సినిమాను తన X ఖాతా ద్వారా 48 గంటల పాటు అందుబాటులో ఉంచారు. ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది దృష్టి ఈ చిన్న బడ్జెట్ వివాదాస్పద సినిమాపై పడింది. మస్క్ చర్యతో సినిమా చుట్టూ ఉన్న చర్చ మరింత పెద్దదైంది. అంతేకాదు, మస్క్ సినిమా సీక్వెల్‌పై కూడా స్పందించారు. ‘Citizen Vigilante 2’ మరింత బాగుంటుందని ఆయన Xలో పేర్కొనడంతో రెండో భాగంపై కూడా చర్చ మొదలైంది. దర్శకుడు ఉవే బోల్ సైతం సీక్వెల్‌ను 2027లో తీసుకురానున్నట్లు ప్రకటించడంతో ఈ సినిమా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
- Tags
- cinema
- Citizen Vigilante
తాజావార్తలు
-
Dulquer Salmaan: “టైటిల్ రోల్ నాది కాదు.. అయినా ఈ సినిమాకి సైన్ చేశా”
-
YS Jagan : ప్రజాస్వామ్య చరిత్రలో ఇది మరో చీకటి రోజు
-
Rapthadu School Attack : రాప్తాడు విద్యార్థినిపై దాడి కేసులో ట్విస్ట్.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు..
-
Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్‌బీర్ క్వశ్చన్ వైరల్!
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..