NTV Telugu Site icon

Arjun Leela : అర్జున్ లీల.. అసలు బొమ్మ చూస్తే ఆగలేరు అంతే

Allu Arjun

Allu Arjun

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఆహా ఓటిటీని నెం 1 స్థానానికి తీసుకురావడానికి కష్టపడుతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే సినిమాపురం పేరుతో ప్రతి శుక్రవారం కొత్త కొత్త సినిమాలను అభిమానులకు అందిస్తున్నారు. ఇంకోపక్క కొత్త షోలు, ఆహా ఒరిజినల్ సిరీస్ లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇతర భాషల్లో మంచి సినిమాలను అల్లు అరవింద్ అస్సలు వదలడు. డబ్బింగ్ చేసి మరీ ఆహాలోకి ఎక్కించేస్తాడు. ఇక ఓటిటీ మార్కెటింగ్ మొత్తాన్ని బన్నీనే దగ్గర ఉండి చూసుకుంటున్నాడు. ఆహా ప్రమోషన్స్ అన్ని బన్నీనే చేస్తున్న విషయం తెల్సిందే. తాజాగా మరో ప్రమోషనల్ వీడియో కోసం బన్నీ రంగంలోకి దిగిన తెల్సిందే. ఈసారి ఆహా యాడ్ కోసం త్రివిక్రమ్ ను రంగంలోకి దింపాడు అల్లు అర్జున్. ఇక మొదటి నుంచి ఈ యాడ్స్ కోసం స్టార్ హీరోయిన్లనే రంగంలోకి దింపుతున్నాడు. ఇక ఈసారి శ్రీలీల ఛాన్స్ వచ్చింది. ఇప్పటికే ఈ యాడ్ కు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేసి నిన్న శ్రీలీలకు బర్త్ డే విషెస్ చెప్పారు మేకర్స్.

Tammanah: ఆ బోల్డ్ సీన్స్ ఏంటి.. ఆ బూతులు ఏంటి.. అసలు నువ్వు మా తమన్నావేనా..?

తాజాగా ఈ యాడ్ యొక్క గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ లో పూల పూల గౌన్ లో ఉన్న శ్రీలీల మెడమీద కత్తి పెట్టి కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించగా.. పోలీస్ డ్రెస్ లో ఉన్న చమ్మక్ చంద్ర అతడిని గన్ తో బెదిరిస్తున్నాడు. అంతలోనే వెనుక నుంచి అల్లు అర్జున్ బ్రాండ్ న్యూ కార్ లో వచ్చి.. పోలీస్ అని అరుస్తూ ముందుకు రావడంతో అర్జున్ లీల.. రేపు ఉదయం 10 గంటలకు రిలీజ్ అవుతుంది అని చెప్పి వీడియో ముగించారు. ఇక ” ఇది గ్లింప్స్ మాత్రమే అస్సలు బొమ్మ చూస్తే ఆగలేరు అంతే.. అర్జున్ లీల.. కేవలం ఆహా యాప్ లోనే.. రేపు ఉదయం 10 గంటలకు” అంటూ మేకర్స్ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ గ్లింప్స్ నెట్టింట వైరల్ గా మారింది. అసలు ఇది యాడ్ యేనా..? లేకపోతే ఏదైనా సర్ ప్రైజ్ ప్లాన్ చేశారా.. ? అనేది తెలియాలంటే రేపటివరకు ఆగాల్సిందే.