టాప్ స్టార్స్ తమ సినిమాల కోసం కొత్త కొత్త మేకోవర్స్ ట్రై చేయడం మనం తరచుగా చూస్తూనే ఉంటాం. కొంతమంది స్లిమ్‌గా కనిపించే నటీనటులు సినిమాల కోసం లావెక్కుతుంటే, మరికొంత మంది నటులు సినిమాల కోసం లేదా వ్యక్తిగత ఆరోగ్యం కోసం స్లిమ్‌గా మారతారు. స్టార్స్ అంటే సినిమాల కోసం ఏమైనా చేస్తారు. అయితే ఆ స్టార్స్ ఫ్యామిలీలో ఉన్న మరికొంతమంది కూడా ఇటీవల కాలంలో సినీ తరాలకు పోటీనిచ్చేలా మారిపోతున్నారు. తాజాగా ఓ స్టార్ హీరో సోదరి కూడా షాకింగ్ బాడీ ట్రాన్స్ఫార్మేషన్ లోకి మారిపోయి అందరినీ ఆశ్చర్యపరిచింది.
Read Also : AP Govt new G.O : కొత్త జీవోపై మహేష్ బాబు రియాక్షన్
బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ సోదరి అన్షులా కపూర్ హాట్ మేక్ఓవర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె తాజా స్నాప్ చూసిన కపూర్ ఫ్యామిలీ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఇంతకుముందు అన్షులా బబ్లీగా ఉండేది. అయితే ఇప్పుడు మాత్రం సన్నగా మల్లెతీగలా మారిపోయింది. తరచుగా జిమ్ కు వెళ్తూ గుర్తు పట్టలేనంతగా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ. ఇక వైరల్ అవుతున్న పిక్స్ లో ఆమె స్పోర్ట్స్ జిమ్ దుస్తులు ధరించింది. అన్షులా చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని, అందుకే ఈ హాట్ మేకోవర్ అంటున్నారు నెటిజన్లు.