Paramapada Sopanam: ‘చిన్ని చిన్ని తప్పులేవో’ చేశానంటున్న అర్జున్ అంబటి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ కి అర్ధనారి వంటి సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసి మంచి పాపులారిటీ సంపాదించుకున్న అర్జున్ అంబటి ఆ తర్వాత బిగ్ బాస్ రియాలిటీ షోతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. తాజాగా ‘తెప్పసముద్రం’ ‘వెడ్డింగ్ డైరీస్’ వంటి వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నారు. అతను హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ ‘పరమపద సోపానం’. అచ్ఛమైన తెలుగు టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఓ ఇంటరెస్టింగ్ థ్రిల్లర్ ప్రేక్షకుల ముందుకు రానుంది . జెన్నీఫర్ ఇమ్మాన్యుయేల్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుంది. ‘ఎస్.ఎస్.మీడియా’ సంస్థ పై గిడిమిట్ల శివ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
గుడిమెట్ల ఈశ్వర్ ఈ చిత్రానికి సహా నిర్మాతగా వ్యవరిస్తున్నారు. అలాగే ఈ సినిమాకు గతంలో పూరి జగన్నాధ్ వంటి దిగ్గజ దర్శకుడికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన నాగ శివ పరమపద సోపానం చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం అందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూలై 11న గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ప్రమోషన్లను వేగవంతం చేస్తూ ముందుగా ‘చిన్ని చిన్ని తప్పులేవో’ అనే లిరికల్ సాంగ్ ను విడుదల చేసింది చిత్ర బృందం.
Also Read
మాస్ మహారాజ్ రవితేజ ‘ఈగల్’ వంటి సినిమాతో సంగీత దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న డేవ్ జాండ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ‘చిన్ని చిన్ని తప్పులేవో’ పాటకి ఆయన అందించిన ట్యూన్ ట్రెండీగా ఉంది. సింగర్స్ పృథ్వీ చంద్ర, అదితి బావరాజు ఆలపించిన విధానం.. రాంబాబు గోశాల అందించిన సాహిత్యం యువతని ఆకర్షించే విధంగా ఉందని చెప్పాలి. విడుదలైన కాసేపటికే ఈ పాటకి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ లభించింది. సినిమా కూడా ఈ పాటలనే అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని చిత్ర యూనిట్ సభ్యులు విశ్వసిస్తున్నారు.
- Tags
తాజావార్తలు
-
iPhone 17 Pro Max: iPhone 18 రాకముందే iPhone 17 Pro Maxపై భారీ ఆఫర్.. రూ.16 వేల వరకు ఆదా!
-
Vaibhav Sooryavanshi-Brett Lee: అవును, వైభవ్ సూర్యవంశీ వయసు 18 ఏళ్లు అయినా ఎవరికి నష్టం?
-
Thani Oruvan 2: రవి మోహన్, నయనతార ‘తని ఒరువన్ 2’ ఆగిపోయిందా? క్లారిటీ ఇచ్చిన నిర్మాత
-
Mojtaba Khamenei Health: మొజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై ఉత్కంఠకు తెర.. కొత్త వీడియో విడుదల చేసిన ఇరాన్
-
Buchi Babu Sana : బుచ్చి.. నెక్ట్స్ సినిమా ఎప్పుడు బాబు.. ఛాన్స్ ఇచ్చే హీరో ఎవరు?
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!