Ariyana : బిగ్ బాస్ షోలో పాల్గొని మంచి గుర్తింపు తెచ్చుకున్న అరియానా గ్లోరీ తరచూ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతో వార్తల్లో నిలుస్తుంది. తాజాగా ఆమె చేసిన కొన్ని కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అరియానా తన గతం గురించి స్పష్టంగా వెల్లడించింది. “నేను తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు నా బావతో లవ్‌లో పడ్డాను. మేమిద్దరం చాలా క్లోజ్‌గా ఉండేవాళ్లం. ఆ తర్వాత హైదరాబాద్‌కు వచ్చాక మేము మూడు సంవత్సరాలు ఒకే రూమ్‌లో ఉన్నాం. కానీ తరువాత కొన్ని కారణాల వల్ల విడిపోయాం” అని తెలిపింది.
Read Also : Pawan Kalyan : పవన్ ఫ్యాన్స్ దెబ్బకు కిటికీలోంచి దూకి వచ్చేశా.. సుమ కామెంట్స్
తన జీవితంలో ఆ ఫేజ్ చాలా కఠినంగా ఉండేదని.. కానీ దానితోనే చాలా నేర్చుకున్నానని కూడా చెప్పింది. మొత్తానికి, తన వ్యక్తిగత జీవితంలోని నిజాలు బహిరంగంగా చెప్పిన అరియానా గ్లోరీ మాటలు ప్రస్తుతం నెటిజన్ల మధ్య పెద్ద చర్చకు దారితీశాయి. ఆమె ఇప్పుడు తన బావకు దూరంగానే ఉంటుంది. ప్రస్తుతం కొన్ని షోలతో బిజీగా ఉంది. అలాగే యూట్యూబ్ ఛానెల్ లో తరచూ వ్లాగ్స్ అప్ లోడ్ చేస్తూ ఫ్యాన్స్ ను ఎంటర్ టైన్ చేస్తోంది. కొన్ని సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు.
Read Also : JR NTR : ఎన్టీఆర్ కు తల్లిగా, భార్యగా నటించిన హీరోయిన్ ఆమెనే..
