అనితరసాధ్యం అర్చన అభినయం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నలుపు నారాయణుడు మెచ్చు అంటారు. నలుపుతోనూ వలపుగేలం వేయవచ్చుననీ కొందరు నిరూపించారు. నలుపున్నా జాతీయ స్థాయిలో ఉత్తమనటిగా గెలుపు చూసిన మేటి నటి అర్చన. ఎలా ఉంటేనేం? అర్చన అభినయంలో ఓ అందం ఉండేది. ఆ చూపుతోనే బంధాలు వేసే శక్తీ ఆమె సొంతమే! వాటిని మించి సుగంధాల వాసనలాంటి లావణ్యం అర్చనలో తిష్టవేసుకుంది. ఇన్ని లక్షణాలున్న తరువాత నలుపు, తెలుపుతో పనేంటి!? అర్చనను ‘బ్లాక్ బ్యూటీ’ అంటూ ఎందరో కీర్తించారు. వరుసగా రెండు సార్లు జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా నిలచి, విమర్శకుల మదినీ గెలిచారు. ఇక జనం మనసుల్లో చెరిగిపోని ముద్ర వేసుకున్నారు. అర్చన చిత్రసీమలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించారు.
అర్చన అసలు పేరు సుధ. పుట్టింది విజయవాడలో. బాల్యంలోనే అర్చన కుటుంబం మద్రాసు చేరింది. నల్లగా, పీలగా ఉన్నా అర్చనలో ఏదో ఆకర్షించే అందం ఉందని గమనించారు సినీజనం. ‘తాయ్ పొంగల్’ అనే తమిళ చిత్రంలో తొలిసారి నటించిన అర్చన, తరువాత భారతీరాజా ‘కాదల్ ఓవియమ్’లో ఓ చిన్న పాత్రతోనే మంచి గుర్తింపు సంపాదించారు. మాతృభాష తెలుగులో ‘మధురగీతం’ అనే చిత్రంలో తొలిసారి నటించారు అర్చన. బాలు మహేంద్ర తెలుగులో తెరకెక్కించిన ‘నిరీక్షణ’లో అర్చన అందం అయస్కాంతంలా కుర్రకారును ఆకర్షించింది. వంశీ ‘లేడీస్ టైలర్’లో నిండుగా చీరకట్టుకొని కవ్వించింది అర్చన అందం. “ఉక్కు సంకెళ్ళు, దాసి, యోగివేమన, మట్టి మనుషులు, భారత్ బంద్, చక్రవ్యూహం, పచ్చతోరణం, పోలీస్ వెంకటస్వామి” వంటి సినిమాల్లో అర్చన నటించారు. వీటిలో “లేడీస్ టైలర్, భారత్ బంద్” మంచి విజయం చూశాయి. ఎన్ని చిత్రాల్లో నటించినా, ఈ నాటికీ ఆ నాటి కుర్రకారు అర్చన పేరు వినగానే ‘నిరీక్షణ’ సినిమానే గుర్తు చేసుకుంటారు.
Also Read
- Romantic Movie OTT: థియేటర్లలో దేకలే... ఓటీటీలో మాత్రం ఊపేస్తున్న తెలుగు రొమాంటిక్ మూవీ
- Peddi Breakeven Target : రామ్ చరణ్ 'పెద్ది' ప్రీ రిలీజ్ బిజినెస్.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?
- Blast Zone : అంచనాలు లేకుండా వచ్చి అదరగొట్టిన యాక్షన్ కింగ్ అర్జున్ 'బ్లాస్ట్'
- Buchi Babu: "నేను పెద్ది 100 సార్లు చూసి.. ఏడ్చేశా".. పెద్ది మూవీపై బుచ్చిబాబు సంచలన వ్యాఖ్యలు!
తమిళ, మళయాళ భాషల్లోనూ అర్చన తనదైన బాణీ పలికించారు. కమర్షియల్ మూవీస్ లో కంటే ఆఫ్ బీట్ సినిమాల్లోనే అర్చన ఎక్కువగా నటించారు. తన పర్సనాలిటీకి ఆ పాత్రలే నప్పుతాయని ఆమె చెప్పేవారు. 1987లో బాలు మహేంద్ర తెరకెక్కించిన తమిళ చిత్రం ‘వీడు’లో ‘నిరీక్షణ’ జోడీ – అర్చన, భానుచందర్ నటించారు. ఆ సినిమా ద్వారా అర్చనకు తొలిసారి జాతీయ స్థాయిలో ఉత్తమనటిగా అవార్డు లభించింది. ఆ మరుసటి సంవత్సరమే బి.నరసింగరావు రూపొందించిన ‘దాసి’ తెలుగు చిత్రం ద్వారా కూడా ఆమెకు మరో నేషనల్ అవార్డు దక్కింది. నటిగా తనదైన బాణీ కొన్ని చిత్రాలలోనే ప్రదర్శించగలిగారు అర్చన. అయితేనేం, జనం మరచిపోలేని నటనతో వారి మదిలో చెదరని స్థానం సంపాదించారామె.
తాజావార్తలు
-
Romantic Movie OTT: థియేటర్లలో దేకలే… ఓటీటీలో మాత్రం ఊపేస్తున్న తెలుగు రొమాంటిక్ మూవీ
-
Peddi Breakeven Target : రామ్ చరణ్ ‘పెద్ది’ ప్రీ రిలీజ్ బిజినెస్.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?
-
Visakhapatnam Tragedy: విశాఖలో విషాదం.. చెవి ఆపరేషన్‌కు ముందు 13 ఏళ్ల బాలిక మృతి!
-
Job News: ఏడాదికి రూ.55 లక్షల భారీ ప్యాకేజీ.. నోటిఫికేషన్ ఔట్.. ఇలా అప్లై చేసుకోండి!
-
Sonam Bail Cancellation: రాజా రఘువంశీ హత్య కేసు.. బెయిల్ పై సోనమ్.. మేఘాలయ ప్రభుత్వం కీలక నిర్ణయం
ట్రెండింగ్
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్‌తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!