Apsara Rani: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వలన పేరు తెచ్చుకున్న బ్యూటీస్ లో అప్పరా రాణి ఒకరు. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్రాక్ సినిమాలో ఐటెం సాంగ్ చేసి మరింత దగ్గరైన అప్సర.. సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతాఇంతా కాదు. మొన్నటికి మొన్న వర్మ డెన్ లో బికినీతో ఫోటోలకు ఫోజులిచ్చి కుర్రకారును రెచ్చగొట్టింది. ఇక తాజాగా ఈ చిన్నది హీరోయిన్ గా ఒక సినిమా చేస్తోంది. విజయ్ శంకర్ అప్సరా రాణి జంటగా రాచరికం అనే చిత్రం రాబోతోంది. చిల్ బ్రోస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ఈశ్వర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీకి సురేష్ లంకలపల్లి కథ, కథనాన్ని అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. రీసెంట్‌గానే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగిన సంగతి తెలిసిందే.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ ఒకటి వచ్చింది. నేడు హీరోయిన్ అప్సరా రాణి పుట్టిన రోజు సందర్భంగా రాచరికం మూవీ నుంచి స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ చూస్తుంటే అప్పరా రాణికి అద్భుతమైన పాత్ర లభించినట్టుగా కనిపిస్తోంది. కాళీ మాత ఉగ్ర రూపం దాల్చితే, రక్తంతో ఒళ్లంతా తడిసి ముద్దైతే ఎలా ఉంటుందో.. ఈ పోస్టర్‌లో అప్సరా రాణి అలా ఉన్నారు. ఈ పోస్టర్‌తో సినిమా మీద అంచనాలు పెంచేశారు. త్వరలోనే మరిన్ని అప్డేట్లతో చిత్రయూనిట్ రానుంది. ఈ చిత్రంలో విజయ రామరాజు, శ్రీకాంత్ అయ్యంగార్, మహబూబ్ బాష, రూపేష్ మర్రాపు, ప్రాచీ థాకర్, లత, ఈశ్వర్ తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు. ఈ మూవీకి వెంగి సంగీతాన్ని అందించగా.. ఆర్య సాయి కృష్ణ కెమెరా మెన్ గా పని చేశారు. ఈ సినిమాకు జేపీ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. మరి ఈ సినిమాతో ఈ హాట్ బ్యూటీ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.