NTV Telugu Site icon

PVT04: వజ్ర కాళేశ్వరి దేవిగా అపర్ణా దాస్!

Panja

Panja

Aparna Das : “ఎన్జన్ ప్రకాశన్, మనోహరం, బీస్ట్” వంటి సినిమాలతో మలయాళ, తమిళ సినీ పరిశ్రమల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ప్రముఖ నటి అపర్ణా దాస్. ఆమె పంజా వైష్ణవ్ తేజ్ నాలుగో చిత్రంతో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టబోతోంది. ఎంతో ప్రతిభ గల ఈ నటిని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తుండటం పట్ల చిత్ర బృందం ఎంతో ఉత్సాహంగా ఉంది. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ఎస్. నాగ వంశీ, ఎస్. సాయి సౌజన్య ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల, జోజు జార్జ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంతో శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

పంజా వైష్ణవ్ తేజ్ చిత్రంలో అపర్ణా దాస్ వజ్ర కాళేశ్వరి దేవి పాత్రను పోషిస్తున్నారు. సినిమాకి ఎంతో కీలకమైన పాత్రలో నటిస్తున్న అపర్ణ, తన అద్భుతమైన నటనా నైపుణ్యంతో పాత్రకు న్యాయం చేస్తుందని చిత్ర బృందం విశ్వసిస్తోంది. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా చిత్రబృందం పక్కా ప్రణాళికతో ఈ చిత్రాన్ని రూపొందిస్తోంది. అపర్ణ ఇటీవల తమిళంలో నటించిన ‘దాదా’ చిత్రం ప్రేక్షకులను మెప్పించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అపర్ణా దాస్ రాక తమ చిత్రానికి మరింత ఆకర్షణ అవుతుందని చిత్ర బృందం నమ్మకంగా ఉంది.

Show comments