Site icon NTV Telugu

Chiranjeevi: చిరంజీవిపై కేసు.. తొమ్మిదేళ్ల తరువాత కొట్టేసిన హైకోర్టు

Chiru

Chiru

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి కి సంబంధించిన కేసును ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది. దాదాపు తొమ్మిదేళ్లు కోర్టులో నలుగుతూ వస్తున్న ఈ కేసుకు విముక్తి లభించింది. అసలు చిరుపై ఉన్న కేసు ఏంటి.. అంటే.. చిరంజీవి సినిమాలను వదిలి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన విషయం తెల్సిందే.ఇక రాజకీయాల్లో చిరుకు కలిసి రాలేదు. దీంతో కొన్నాళ్ళు ఆయన కాంగ్రెస్ కు ప్రచారకర్తగా మారారు. 2014 ఎన్నికల నేపథ్యంలో చిరంజీవి గుంటూరులో ప్రచార సభ ఏర్పాటు చేశారు. ఇక చిరు మీటింగ్ అనేసరికి మెగా ఫ్యాన్స్ ఇసుకేస్తే రాలనంతగా వచ్చారు. ఇక ఎన్నికల కోడ్ ప్రకారం.. ప్రభుత్వం ఎంత సమయం ఇస్తే అంతే సమయంలో సభను ముగించాలి. కానీ, చిరు నిర్ణీత సమయంలో సభను ముగించకపోవడంతో ఎలక్షన్ కోడ్ ను ఉల్లంఘించినట్లు కేసు నమోదు అయ్యింది. అప్పటి నుంచి ఈ కేసు హైకోర్టులో నలుగుతూనే ఉంది. ఇక ఆ తరువాత చిరు.. తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. ఆ పిటిషన్ ను పరిసరిశీలించిన న్యాయస్థానం తాజాగా కేసును కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. దీంతో చిరుకు ఊరట లభించింది.

Vaishnavi Chaitanya: ‘బేబీ’ని మెచ్చిన ఇస్మార్ట్ రామ్.. వాటిని పట్టుకొని గాల్లో తేలిపోతున్న వైష్ణవి

ఇక ప్రస్తుతం చిరంజీవేయి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇకముందు కూడా రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదని కూడా తెలుస్తోంది. ప్రస్తుతం చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా మారారు. ఇప్పటికే భోళా శంకర్ రిలీజ్ కు సిద్ధమవుతుండగా.. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడ. ఈ సినిమా మలయాళ హిట్ సినిమా బ్రో డాడీకి రీమేక్ అని సమాచారం. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.

Exit mobile version