Site icon NTV Telugu

Ghati-Mirai-The Girlfriend : అనుష్క, తేజసజ్జ మధ్య భీకర పోటీ.. రష్మిక నిలబడుతుందా..?

Ghati Mirai

Ghati Mirai

Ghati-Mirai-The Girlfriend : అయితే అనావృష్టి లేదంటే అతివృష్టి అన్నట్టు.. టాలీవుడ్ లో సినిమాలు వస్తే ఒకేసారి కుప్పలుగా ఒకేరోజు వచ్చేస్తాయి. లేదంటే చాలా కాలం గ్యాప్ ఇస్తాయి. ఆగస్టులో పెద్దగా సినిమాల పోటీ కనిపించట్లేదు. కానీ సెప్టెంబర్ 5న మాత్రం చాలా సినిమాలో పోటీ పడుతున్నాయి. అనుష్క హీరోయిన్ గా క్రిష్‌ డైరెక్షన్ లో వస్తున్న ఘాటీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను సెప్టెంబర్ 5న రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు తేజసజ్జ హీరోగా వస్తున్న మిరాయ్ మూవీని సెప్టెంబర్ 5నే రిలీజ్ చేస్తున్నారు. హనుమాన్ తర్వాత తేజ చేస్తున్న మూవీ.. పైగా టీజర్ తో భారీ అంచనాలు పెంచేసింది. మధ్యలో రష్మిక హీరోయిన్ గా రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్ లో వస్తున్న ది గర్ల్ ఫ్రెండ్ ఇదే డేట్ కు రిలీజ్ అవుతోంది.

Read Also : Manchu Lakshmi : మంచు లక్ష్మీ యాసపై బన్నీ కూతురు సెటైర్లు..

కానీ ఘాటీ, మిరాయ్ తో పోలిస్తే రష్మిక సినిమాపై అంతగా అంచనాలు లేవు. అటు మురుగదాస్ డైరెక్షన్ లో తమిళ హీరో శివ కార్తికేయన్ నటించిన మదరాసి మూవీ సెప్టెంబర్ 5నే వస్తోంది. విజయ్ ఆంటోనీ హీరోగా వస్తున్న భద్రకాళిని ఇదే రోజున తెస్తున్నారు. మూడు తెలుగు సినిమాలు, రెండు తమిళ సినిమాలు మొత్తం 5 ఒకేరోజున వస్తున్నాయి. కానీ తెలుగు సినిమాలకే మంచి డిమాండ్ ఉంది. ఘాటీ, మిరాయ్ సినిమాల మధ్యనే ప్రధాన పోటీ ఉండబోతోంది. మధ్యలో అనుష్క మూవీ నిలబడుతుందా లేదా అన్నది సందేహం. ఇన్ని సినిమాలు థియేటర్లు పంచుకోవడం అంటే కష్టమే. కానీ హిట్ టాక్ ఉన్న సినిమాలకే థియేటర్లలో డిమాండ్ ఉంటుంది. అనుష్క, తేజసజ్జకు మంచి మార్కెట్ ఉంది. రష్మికకు పాన్ ఇండియా క్రేజ్ ఉన్నా.. గర్ల్ ఫ్రెండ్ కంటెంట్ మీద బజ్ లేదు. వాళ్లిద్దరి సినిమాల ముందు ఈ నేషనల్ క్రష్ నిలబడుతుందా లేదా అన్నది చూడాలి.

Read Also : Spirit : స్పిరిట్ లో ప్రభాస్ తో నటించే ఛాన్స్.. ఇలా అప్లై చేయండి

Exit mobile version