NTV Telugu Site icon

Anushka Marriage: త్వరలో నిర్మాతతో అనుష్క పెళ్లి?

Anushka

Anushka

Anushka to Marry a Kannada Producer Soon: తెలుగు సినీ పరిశ్రమలో అనుష్క శెట్టి స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. నాగార్జున హీరోగా నటించిన సూపర్ సినిమా తో టాలీవుడ్ కి పరిచయమయి కోడి రామకృష్ణ దర్శకత్వంలో చేసిన అరుంధతి వంటి లేడీ ఓరియెంటెడ్ మూవీతో బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఈ సినిమాతో అనుష్క స్టార్ హీరోయిన్ అయిపోయింది. అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అరుంధతి భారీ విజయాన్ని సాధించడంతో అనుష్కకు వరుస అవకాశాలు వచ్చాయి. మహేష్ , ప్రభాస్ వంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది.. అనంతరం బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో బాగా పాపులర్ అయింది. ఆ తర్వాత మాత్రం ప్రేక్షకులను పులకరించడమే గగనం అయింది.

Chaya Singh: నటి ఇంట పనిమనిషి ఘాతుకం.. నమ్మించి ఏం చేసిందంటే?

ఈ భామ నిశ్శబ్దం, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి లాంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా ఆ సినిమాలు అంతగా ఆకట్టుకోలేదు. ఇక ఆమె పెళ్లి గురించిన చర్చ ఎప్పటికప్పుడు తెరమీదకు వస్తూనే ఉంది. ఇక ఇప్పుడు అనుష్కపై ఓ రూమర్ ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. అదేమంటే ఇప్పుడు 42 ఏళ్ల అనుష్క కన్నడ సినీ నిర్మాతను వివాహం చేసుకోనుందని అంటున్నారు. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న ఈ సమాచారంలో ఎంత నిజం ఉందో తెలియదు. నిజానికి కొన్నాళ్ల క్రితం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ప్రమోషన్స్ లో పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది ఈ భామ.. తాను పెళ్లికి వ్యతిరేకం కాదని.. సమయం వచ్చినప్పుడు కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని చెప్పింది. ఇక ఇప్పుడు నిజంగా అనుష్క పెళ్లి జరుగుతుందా? లేక ప్రచారానికి మాత్రమే పరిమితం అవుతుందా? అనేది తెలియాల్సి ఉంది.

Show comments