Anushka vs Rashmika : సీనియర్ హీరోయిన్ అనుష్క శెట్టికి ఉన్న ఫాలోయింగ్ వేరే లెవల్. లేడీ సూపర్ స్టార్ ట్యాగ్ లైన్లు కూడా ఈ మధ్య సోషల్ మీడియా ఇచ్చేస్తోంది. ఎన్నో లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో తానేంటో చూపించింది. అలాంటి అనుష్క ముందు పాన్ ఇండియా క్రేజ్ ఉన్న రష్మిక నిలబడుతుందా.. ఇప్పుడు టాలీవుడ్ లో ఇదే హాట్ టాపిక్. అనుష్క హీరోయిన్ గా క్రిష్ డైరెక్షన్ లో వస్తున్న మూవీ ఘాటీ. మోస్ట్ వయోలెంటెడ్, రస్టిక్ డ్రామాగా రాబోతోంది. ఇప్పటికే వచ్చిన పోస్టర్లు అంచనాలను అమాంతం పెంచేశాయి. ఏప్రిల్ 18న రావాల్సిన ఈ సినిమాను ఇప్పటికే వాయిదా వేశారు. తాజాగా సెప్టెంబర్ 5న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారంట. ఇదే రోజున రష్మిక నటించిన ది గర్ల్ ఫ్రెండ్ మూవీ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది.
Read Also : HHVM : పుష్ప-2తో పోయింది.. ’వీరమల్లు’తో మొదలవుతుందా….?
రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా కూడా సెప్టెంబర్ 5న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారంట. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. అంటే అనుష్క వర్సెస్ రష్మిక వార్ తప్పదన్నమాట. కానీ అనుష్క ముందు రష్మిక నిలబడుతుందా అనేదే పెద్ద డౌట్. ఎందుకంటే రెండూ ఫీమేల్ లీడ్ సినిమాలే. రష్మిక నుంచి వస్తున్న ఫస్ట్ ఫీ మేల్ లీడ్ సినిమా ఇది. కానీ అనుష్కకు యూత్ లో మాస్ ఫాలోయింగ్ ఉంది. ఆమె కోసమే థియేటర్లకువ వెళ్లే ఫ్యాన్స్ ఉన్నారు. పైగా క్రిష్ డైరెక్షన్. సినిమా పోస్టర్లు అంచనాలను భారీగా పెంచాయి. కథ కొత్తగా ఉంటుందని తెలుస్తోంది. కానీ రష్మిక గర్ల్ ఫ్రెండ్ మూవీ గురించి పెద్దగా టాక్ వినిపించట్లేదు. ఒకవేళ ఈ మూవీ కోసం వెళ్లినా రష్మిక కోసమే తప్ప.. మూవీలో ఏదో ఉందని ఆశించి వెళ్లే పరిస్థితి అయితే కనిపించట్లేదు. మరి అనుష్క ముందు రష్మిక ఏ మాత్రం నిలదొక్కుకుంటుందో చూడాలి.
Read Also : Tanya : కెమెరామెన్ తో హీరోయిన్ ఎంగేజ్ మెంట్..
