Site icon NTV Telugu

Anushka Shetty : ఘాటి ప్రమోష‌న్స్‌కి దూరంగా అనుష్క.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత

Gati Anushka

Gati Anushka

ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో ఆకట్టుకున్న అనుష్క శెట్టి.. ఈ మధ్యకాలంలో కొద్దిగా స్లో & స్టడీగా సినిమాలు చేస్తోంది. ఈ సారి పాన్-ఇండియా స్థాయిలో భారీ అంచనాలతో ‘ఘాటి’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా సెప్టెంబర్ 5న థియేటర్లలో రిలీజ్‌కి సిద్ధమవుతోంది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో యాక్షన్-క్రైమ్ డ్రామా, గంజాయి మాఫియా నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీలో అనుష్క ఓ శక్తివంతమైన గిరిజన మహిళ గా కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్‌లో అనుష్క అదిరిపోయే గెటప్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఫ్యాన్స్‌లో ఫుల్ హైప్ నెలకొంది. అయితే ఈ మధ్య కాలంలో సినిమా తో పాటు ప్రమెషన్స్ విషయంలో కూడా ప్రతి ఒక్క మూవీ టీం చాలా కష్టపడుతున్నారు. కానీ, ‘ఘాటి’ ప్రమోషన్స్‌లో అనుష్క కనిపించకపోవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. అయితే..

Also Read : Mirai : నాకు పాన్ ఇండియా హీరో అవ్వాలని లేదు.. తేజ

ఈ విషయం‌పై నిర్మాత స్పష్టత ఇచ్చారు.. “అనుష్క ప్రమోషన్స్‌లో పాల్గొనబోనని షూటింగ్‌కు ముందే స్పష్టంగా తెలిపింది. ఆ మేరకు ఒప్పందం కూడా కుదిరింది’ అని తెలిపారు. దీంతో ఆమె ఎందుకు ప్రమోషన్స్‌కు దూరంగా ఉన్నది? అనే ప్రశ్న పై టాలీవుడ్ వర్గాల్లో రూమర్లు వినిపిస్తున్నాయి. వ్యక్తిగత కారణాలా, లేదా ఇతర సినిమాల కమిట్‌మెంట్స్ కారణమా అన్నది తెలిడం లేదు. ప్రీరిలీజ్ ఈవెంట్‌కు అయినా అనుష్క హాజరేయేనా? అనే అంశం ఫ్యాన్స్‌లో చర్చనీయాంశంగా మారింది. అంటే దీని బట్టి సినిమా షూటింగ్ వరకు మాత్రమే అనుష్క కమిటైనట్లు, ప్రమోషన్, సక్సెస్ మీట్‌లకు హాజరు కారని స్పష్టంగా తెలుస్తోంది. కానీ అనుష్క హాజరు కాలేకపోయినా, ఘాటి టీమ్ దేశవ్యాప్తంగా విస్తృత ప్రమోషన్లతో సినిమాపై ఆసక్తి పెంచుతూ ఉంది.

Exit mobile version