Anushka : ఇటీవల అనుష్క ‘ఘాటీ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. సినిమా టాక్ యావరేజ్‌గా ఉన్నా, కలెక్షన్స్ విషయంలో మాత్రం వెనుకబడింది. గంజాయి సాగు నేపథ్యంలో రూపొందించబడిన ఈ సినిమాకు ఆశించిన మేర ఫలితాలు రాలేదు. అయితే, తాజాగా అనుష్క తన సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన చేసింది. “ట్రెడింగ్ బ్లూ లైట్ టు క్యాండిల్‌లైట్, కొన్నాళ్లపాటు సోషల్ మీడియా నుంచి దూరంగా ఉండాలని అనుకుంటున్నాను.
Read Also : Rithika Nayak : టాలీవుడ్ కు మరో స్టార్ హీరోయిన్ వచ్చేసినట్టే..
ఈ ప్రపంచంతో కనెక్ట్ అయ్యి, స్క్రోలింగ్ నుంచి దూరంగా ఉండాలనుకుంటున్నాను. ఎక్కడైతే నేను మొదలైయ్యానో, అక్కడ కొన్నాళ్లపాటు ఉండాలనుకుంటున్నాను,” అంటూ తన యోగా జీవితం గురించి హింట్ ఇచ్చింది. “మిమ్మల్ని త్వరలోనే మరిన్ని కథలతో కలవబోతున్నాను,” అంటూ కూడా ఆమె పేర్కొంది. “ఎల్లప్పుడూ మీ ప్రేమతో, మీ ప్రేమకై ఉండే అనుష్క శెట్టి,” అంటూ ఆమె ఒక లేఖ రాసి, దాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. క్రిష్ డైరెక్షన్‌లో రూపొందిన ‘ఘాటీ’ సినిమాలో అనుష్క శీలావతి అనే పాత్రలో నటించింది. ఆమె సరసన విక్రమ్ ప్రభు హీరోగా నటించాడు. ఇక ఈ సినిమాలో జగపతి బాబు, చైతన్య రావు వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించారు.
Love…. always forever ❤️ pic.twitter.com/ALRfMrvpK0
— Anushka Shetty (@MsAnushkaShetty) September 12, 2025
