Anushka Shetty Skips Miss Shetty Mr Polishetty Promotions: భాగమతి అనే సినిమాతో కొంతవరకు హిట్ అనిపించుకున్న అనుష్క ఆ తర్వాత నిశ్శబ్దం అనే సినిమా చేసినా కేవలం అది ఓటీటీలో రిలీజ్ అయింది. ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక ఈ క్రమంలో అనుష్క ఎలాంటి సినిమా చేస్తుందా? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో నవీన్ పోలిశెట్టితో సినిమా చేస్తున్నట్టు అధికారిక ప్రకటన వచ్చింది. ఇప్పటికే ఒక సినిమా చేసిన అనుభవం ఉన్న మహేష్ బాబు డైరెక్షన్లో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో అనుష్క ఒక షెఫ్ పాత్రలో కనిపిస్తుండగా నవీన్ స్టాండప్ కమెడియన్ గా కనిపిస్తున్నాడు. ఇప్పటికే అనేకమార్లు వాయిదా పడిన ఈ సినిమా సెప్టెంబర్ 7న రిలీజ్ కి రెడీ అవుతున్న క్రమంలో నవీన్ ఒకపక్క పెద్ద ఎత్తున ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు.
Malaika Arora: మలైకా-అర్జున్ కపూర్ బ్రేకప్ నిజమే.. ఇవిగోండి ప్రూఫ్స్!
అయితే ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ సహా ఎక్కడా అనుష్క మాత్రం కనిపించడం లేదు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో ఆమె ఇంకా కనిపించే అవకాశం లేదని తెలుస్తోంది. ఈ సినిమాకి సంబంధించి కేవలం ఒకే ఒక రికార్డు వీడియోలో మాత్రమే అనుష్క శెట్టి కనిపించబోతోంది ఆ ఒక్క వీడియోని మొత్తం మీడియాకి రిలీజ్ చేసే అవకాశాలను సినిమా యూనిట్ పరిశీలిస్తుంది. అనుష్క శెట్టి ఇటీవల ఒక వీడియో ఇంటర్వ్యూ చేసింది, అది అన్ని మీడియా సంస్థలకు ఇస్తారని అంటున్నారు. ఇక ఆ వీడియో తప్ప ఆమె సినిమాకు ఎలాంటి ప్రమోషన్లు చేయదని అంటున్నారు. నిజానికి ఈ మధ్యనే కాదు బాహుబలి తరువాత నుంచి అనుష్క శెట్టి పబ్లిక్ ఈవెంట్స్, అప్పియరెన్స్ లకు దూరంగా ఉంది. ఇప్పుడు కూడా ఆమె పబ్లిక్ ముందుకు వచ్చేందుకు ఇష్టపడడంలేదని అంటున్నారు.