Site icon NTV Telugu

Ghati : మొత్తానికి ‘ఘాటి’ ప్రమోషన్ పై స్పందించిన అనుష్క.. వీడియో వైరల్

Anushka Ghati

Anushka Ghati

జనాలను థీయేటర్‌కి తీసుకురావడం ప్రజంట్ ఛాలేంజ్ లా మారింది. OTT దీనికి ముఖ్య కారణం అని చెప్పవచ్చు. అందుకే చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయిన ప్రమోషన్స్ మాత్రం పక్కా చేయాల్సిందే. కానీ ఘాటి’ సినిమా ప్రమోషన్లలో హీరోయిన్ అనుష్క శెట్టి హాజరు కాకపోవడం సినీ వర్గాల్లో, అభిమానుల్లో చర్చనీయాంశమైంది. ఆమె ముందుగానే చెప్పడంతో.. బృందం ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తూ సినిమా కంటెంట్‌ ద్వారానే హైప్ సృష్టించడానికి ప్రయత్నిస్తోంది.

Also Read : Nargis Fakhri : రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ హాట్ బ్యూటీ..

కానీ అనుష్క ఫేస్ టు ఫేస్ ప్రమోషన్లలో కనిపించకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం పూర్తి స్థాయిలో సినిమా ప్రచారంలో భారమవుతోంది. ఇటీవల తాజాగా ఒక AI ఫ్యాన్-మేడ్ వీడియో లో చిన్ననాటి అనుష్క ముఖాన్ని చూపిస్తూ, ఆమె వాయిస్‌తో సినిమా చూడమని కోరుతూ వీడియోను X (ట్విట్టర్)లో షేర్ చేసింది. ఈ వీడియోపై స్పందించిన అనుష్క..“మీ అందరి ప్రేమ, మద్దతు ఎప్పుడూ నాకు చిరునవ్వు తీసుకువస్తాయి. మా చిన్న శీలవతి వెర్షన్‌ను ఇంత అందంగా సృష్టించినందుకు ధన్యవాదాలు. సెప్టెంబర్ 5న థియేటర్స్‌లో కలుద్దాం’ అంటూ రాసింది.

 

Exit mobile version