Anushka: నవ్వి నవ్వి ఏడుస్తారు… టిష్యూస్ తెచ్చుకోండి… మాములుగా ఉండదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, జాతిరత్నాలు సినిమాలతో యూత్ ని జానేజిగర్ గా మారిపోయాడు యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి. మోస్ట్ ప్రామిసింగ్ ఫ్యూచర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న ఈ హీరో, లేడీ సూపర్ స్టార్ గా పేరున్న స్వీట్ బ్యూటీ అనుష్క శెట్టితో కలిసి నటిస్తున్న సినిమా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. యువీ క్రియేషన్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీలో నవీన్ స్టాండప్ కమెడియన్‌గా, అనుష్క చెఫ్‌గా నటిస్తున్నారు. ఒక కొత్త బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ ఫీల్ గుడ్ సినిమాని పి.మహేష్ బాబు డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రమోషనల్ కంటెంట్ తో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా పేరు తెచ్చుకున్న ‘మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి’ సినిమా రిలీజ్ డేట్ ని మేకర్స్ అనౌన్స్ చేసారు. చాలా రోజులుగా ఆగుతూ వస్తున్న ఈ సినిమాకి ఎట్టకేలకు మోక్షం కల్పిస్తూ ఆగస్టు 4న రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు.
“Keep your tissues ready, cos you’re about to cry with 𝙇𝙖𝙪𝙜𝙝𝙩𝙚𝙧. Meet #MissShettyMrPolishetty in theatres from 𝘼𝙐𝙂𝙐𝙎𝙏 4𝙩𝙝!” అంటూ యువీ క్రియేషన్స్ నుంచి ట్వీట్ వచ్చింది. ఆగస్టు రెండో వారంలో మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’ సినిమాతో ఆడియన్స్ ముందుకి వస్తున్నాడు. ఇదే టైమ్ కి సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా ‘జైలర్’ సినిమాతో ప్రేక్షకులని పలకరించనున్నాడు. ఈ రెండు సినిమాలకి వారం ముందే “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి” సినిమా రిలీజ్ అవుతుంది అంటే బ్రేక్ ఈవెన్ మార్క్ చేరడానికి, థియేటర్స్ ని నిలబెట్టుకోవడానికి అనుష్క, నవీన్ పోలిశెట్టి దగ్గర ఉన్నది వారం సమయం మాత్రమే. ఈ వారం గ్యాప్ లోనే “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి” సినిమా సత్తా చాటాల్సి ఉంది.
Also Read
Keep your tissues ready, cos you're about to cry with 𝙇𝙖𝙪𝙜𝙝𝙩𝙚𝙧 🤩🥳
Meet #MissShettyMrPolishetty in theatres from 𝘼𝙐𝙂𝙐𝙎𝙏 4𝙩𝙝! @MsAnushkaShetty @NaveenPolishety @filmymahesh @radhanmusic #NiravShah #RajeevanNambiar #KotagiriVenkateswararao @JSKapoor1234 pic.twitter.com/Gc3J0wOlZI
— UV Creations (@UV_Creations) July 3, 2023
తాజావార్తలు
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Shubman Gill: 36 పరుగులతో చరిత్ర స్పష్టించిన శుభ్‌మన్ గిల్.. కెరీర్లోనే అరుదైన రికార్డు..
-
Andhra Pradesh : ఏపీకి కేంద్రం భారీ నజరానా.. రూ.1,990 కోట్ల అర్బన్ చాలెంజ్ ఫండ్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్.!
-
UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
-
Cockroach Janta Party: “కాక్రోచ్ జనతా పార్టీ” ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!