NTV Telugu Site icon

Anushka : ‘ఘాటీ’ మూవీ న్యూ అప్‌డేట్..

Untitled Design (82)

Untitled Design (82)

టాలీవుడ్ క్వీన్ అనుష్క శెట్టి స్థానం వేరే ఎవరు భర్తీ చేయలేరు అనే విషయం అందరికీ తెలిసిందే. ఉన్న హీరోయిన్స్ అంతా వేరు అనుష్క వేరు. హీరోయిన్ గానే కాకుండా సోలో సినిమాలకి కూడా మంచి మార్కెట్ ని సొంతం చేసుకుంది. ‘బాహుబలి’ సక్సెస్ తర్వాత ఈ అమ్మడు ప్రాధాన్యత ఎక్కువ ఉన్న సినిమాలు ఎంచుకుంటుంది. ఇందులో భాగంగానే లేటెస్ట్‌గా ‘ఘాటీ’ మూవీతో రాబోతుంది. యూవీ క్రియేషన్స్ సమర్పణలో, రాజీవ్ రెడ్డి, సాయిబాబా నిర్మిస్తున్న ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నాడు.

Also Read: Samantha : లైఫ్ లో మళ్ళీ అలాంటి పని చేయను

‘వేదం’ మూవీతో క్రిష్-అనుష్క కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తికాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.  ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, ఇతర ప్రమోషనల్ కంటెంట్ బాగా అలరించగా, అనుష్క పాత్ర చాలా స్టన్నింగ్,రూత్‌లెస్‌ అవతార్‌ను ప్రజెంట్ చేసింది. ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండటంతో, ప్రేక్షకుల అంచనాలను పెంచింది.

కానీ, రిలీజ్ దగ్గరకి వస్తున్నప్పటికీ మేకర్స్ మౌనంగా ఉండడం అనేది ఫ్యాన్స్ లో టెన్షన్‌గా మారింది. కానీ తాజా సమాచారం ప్రకారం, మేకర్స్‌తో సహా అనుష్క ఈ సినిమా ప్రమోషన్స్‌ని, ఈ మార్చ్ మధ్య నుంచి  స్టార్ట్ చేస్తారని తెలుస్తుంది. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. చాలా గ్యాప్ తర్వాత అనుష్కని ఇలాంటి పాత్రలో చూస్తుంనందుకు, ప్రేక్షకుల్లో ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. కానీ ఈ మధ్య కాలంలో సినిమాకు ప్రమోషన్స్ ఎంతో ముఖ్యం. కనుక ఈ ప్రమోషన్స్ వీషయంలో  కొంత కష్టపడింది అంటే అనుష్క మంచి హిట్ అందుకున్నట్లే.