Site icon NTV Telugu

Star Director: నేనేది ఫ్రీగా చేయను.. నా రేటు గంటకు రూ. 5 లక్షలు.. డైరెక్టర్ వైరల్ పోస్ట్

Anurag Kashyap

Anurag Kashyap

బాలీవుడ్ వివాదాస్పద దర్శకుడిగా పేరుతెచ్చుకున్నాడు అనురాగ్ కశ్యప్. ఎలాంటి విషయం అయినా ఆయన మాట్లాడితే వివాదం అవ్వాల్సిందే. ఇక ఈయనపై ఎంతోమంది హీరోయిన్లు లైంగిక వేధింపుల ఆరోపణలు కూడా చేశారు. అయినా ఆధారాలు లేకపోవడంతో అవన్నీ వట్టి మాటలే అని కొట్టిపారేశాడు. ప్రస్తుతం ఒకపక్క డైరెక్టర్ గా, నటుడిగా బిజీగా ఉన్న అనురాగ్.. సోషల్ మీడియాలో ఒక వైరల్ పోస్ట్ ను షేర్ చేశాడు. ఇకనుంచి తాను ఏ పని ఫ్రీగా చేయనని తన రేటును చెప్పుకొచ్చాడు. బాలీవుడ్ ఇండస్ట్రీకి కొత్తగా వచ్చేవారికి అనురాగ్ ఎంతోకాలంగా చాలా సహాయం చేస్తున్నాడట. దీనివలన ఎంతో సమయం వృథాగా గడిచిపోయిందని, అందుకే ఇక నుంచి ఆ సమయాన్ని వృథా చేయకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. ఎవరైనా తెలియని వారు తనతో మాట్లాడాలి అనుకుంటే.. డబ్బులిచ్చి మాట్లాడవచ్చని తెలుపుతూ తన రేటు ఇది అంటూ కూడా చెప్పుకొచ్చాడు.

“నేను ఇప్పటివరకు ఇండస్ట్రీకి ఎంతోమందిని పరిచయం చేశాను. దానిద్వారా నాకు టైమ్ వేస్ట్ తప్ప ఏది లేదు. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను.ఇకనుంచి నేనేది ఫ్రీగా చేయను. నన్ను కలిసి, మాట్లాడాలని అనుకున్నవారు.. ఖచ్చితంగా నేను పెట్టిన రేటును గౌరవించి డబ్బులు చెల్లించి మాట్లాడండి. 10-15నిమిషాలు కలవాలంటే రూ.1 లక్ష చెల్లించాలి. అరగంట మాట్లాడాలంటే రూ.2 లక్షలు.. అదే గంటసేపు నాతో మాట్లాడటానికి రూ.5 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. అంత డబ్బు ఉండి.. నాతో మాట్లాడాలంటేనే రండి. లేకపోతే వెళ్లిపోండి. షార్ట్ కట్ లో ఎదగాలి అనుకున్నవారిని చూసి అలిసిపోయాను. ఇక మరో ముఖ్యమైన విషయం.. ఆ డబ్బులు మొత్తం ముందే అడ్వాన్స్ గా ఇచ్చేయాలి” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

Exit mobile version