సోషల్ మీడియా వచ్చాకా హీరోయిన్లకు భద్రత లేకుండా పోయింది. ఆకతాయిలు హీరోయిన్ల ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియా లో పోలిష్ చేయడం లాంటివి చేస్తూ పైశాచికానందం పొందుతుంటారు. చాలామంది హీరోయిన్లు ఇలాంటి హ్యాకర్ల చేతిలకు చిక్కి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆలా ఇబ్బందులు ఎదుర్కున్న హీరోయిన్లో కుర్ర బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ కూడా ఉంది. గతంలో ఆమె ఫేస్ బుక్ ని హ్యాక్ చేసిన హ్యాకర్స్ ఆమె మార్ఫింగ్ ఫోటోలను పోస్ట్ చేసి హల్చల్ చేశారు. ఈ విషయంలో అనుపమ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఇక చాలా రోజుల తరువాత అనుపమ ఈ విషయంపై నోరు విప్పింది.
గతంలో నా మార్ఫింగ్ పోటోలను షేర్ చేయడం నన్ను ఎంతగానో బాధించాయి అని తెలుపుతూ ఆమె ఎమోషనల్ అయ్యింది. అంతేకాకుండా సోషల్ మీడియాలో వచ్చే ఘాటు కామెంట్స్ కి కూడా అంతే ఘాటుగా సమాధానం ఇవ్వడం అప్పటినుంచే నేర్చుకున్నాను అని, ఆ ఘటన జరిగాక కొన్నిరోజులు ఇంట్లో కూడా ఉండలేకపోయానని చెప్పుకొచ్చింది. ఇకపోతే ప్రస్తుతం అనుపమ నిఖిల్ సరసన కార్తికేయ 2 లో, 18 పేజీస్ లో నటిస్తోంది.
