Site icon NTV Telugu

పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అయిన అనుపమ పరమేశ్వరన్..

anupama

anupama

ప్రేమమ్ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్. ఈ సినిమా తరువాత ‘అఆ’ చిత్రంతో తెలుగింటి ఆడపడుచుల కనిపించి తెలుగువారి హృదయాల్లో కొలువుండిపోయింది. ఇక ఇటీవల ‘రౌడీ బాయ్స్’ చిత్రంలో అమ్మడి నటనకు కుర్రకారు ఫిదా అయినా సంగతి తెలిసిందే. ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ భామ తాజాగా కొన్ని ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. దీంతో ఒక్కసారిగా అభిమానులందరూ షాక్ కి గురయ్యారు. ఆ ఫొటోల్లో అంతగా ఏం ఉంది అని అంటే.. అనుపమ బేబీ బంప్ తో దర్శనమిచ్చింది.

ఏంటి అనుపమ ప్రెగ్నెంట్ ఎప్పుడు అయ్యింది.. అస్సలు పెళ్లి ఎప్పుడు అయ్యింది.. ఎవరితో అయ్యింది అని కంగారు పడాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆ ఫోటోలు తన పాత చిత్రంలోనివి. 2019లో ఓ మలయాళ చిత్రంలో అనుపమ గర్భవతిగా నటించింది. ఆ షూటింగ్‌లో భాగంగా తీసుకున్న ఫోటోలను అమ్మడు షేర్ చేసింది. ఇంకేముంది ఆ ఫోటోలకు ముందు వెనుక చూడకుండా అందరు కంగ్రాట్స్ అంటూ చెప్పుకొచ్చేస్తున్నారు. ఇక ఈ ఫోటోలలో అనుపమ తండ్రి కూడా ఉండడం విశేషం. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇకపోతే ప్రస్తుతం అనుపమ, నిఖిల్ సరసన 18 పేజీస్ చిత్రంలో నటిస్తుంది. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది.

Exit mobile version