Site icon NTV Telugu

Anupama Parameshwaran : యాక్టింగ్ రాదని అవమానించారు.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Anupama

Anupama

Anupama Parameshwaran : మళయాల భామ అనుపమకు యూత్ లో భారీ ఫాలోయింగ్ ఉంది. యాక్టింగ్ పరంగా అదరగొట్టేస్తుంది ఈ బ్యూటీ. అందం, నటన, డ్యాన్స్.. మూడింటిలో ఈ బ్యూటీకి తిరుగులేదు. అలాంటి అనుపమను నటన రాదంటూ ట్రోల్ చేశారంట. ఈ విషయాలను ఆమెనే స్వయంగా వెల్లడించింది. నేను ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో ఇలాంటివి ఎక్కువగా కనిపించాయి. సోషల్ మీడియాలోనే కాదు ఇండస్ట్రీలోనూ ఇలాంటి కామెంట్స్ వచ్చాయి. నిజంగానే నాకు యాక్టింగ్ రాదేమో అనుకుని బాధపడ్డాను.

Read Also : Thug Life : థగ్ లైఫ్‌ కన్నడలో రిలీజ్ చేయాల్సిందే.. సుప్రీంకోర్టు ఆర్డర్..

అలాంటి టైమ్ లో నన్ను ప్రవీణ్ నమ్మారు. జానకి వర్సెస్ కేరళ సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. ఆ మూవీతో నాకు ప్రశంసలు వచ్చాయి. అప్పుడే నాకు ఒకటి అర్థం అయింది. ప్రేక్షకులకు నచ్చే సినిమాలు చేస్తే ఇలాంటి ట్రోల్స్ పట్టించుకోవాల్సిన అవసరం లేదని. అప్పటి నుంచే మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తున్నా. ఒకప్పుడు ట్రోల్ చేసిన వారే ఇప్పుడు మెచ్చుకుంటున్నారు.

సినిమాల పరంగా నన్ను నేను ఎంతో మలుచుకున్నా. ఇప్పటి వరకు చేయని ఎన్నో పాత్రలను ఇప్పుడు చేయగలుగుతున్నా. గ్లామర్ పాత్రల కన్నా నటనకు స్కోప్ ఉన్న పాత్రలే చేయాలని అనుకుంటున్నా. అవే నన్ను ఇండస్ట్రీలో నిలబెడుతాయి. గ్లామర్ పాత్రలు అందరూ చేస్తారు. కానీ యాక్టింగ్ ఎక్కువగా ఉండే పాత్రలు చేసినప్పుడే మనకు గుర్తింపు ఉంటుంది అంటూ తెలిపింది అనుపమ.

Read Also : Vijayawada: భర్త కొడుతున్నాడని 112 కు ఫోన్ చేసిన మహిళ… చివరికీ..

Exit mobile version