టాలీవుడ్ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్న తాజా చిత్రం ‘పరదా’ . ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 22న విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమా విషయంలో అనుపమ మునుపునడు లేని విధంగా ప్రమోషన్స్ చేస్తోంది. ఏ ఒక్క ఛాన్స్ కూడా వదలకుండా వరుస ఇంటర్వ్యూట ఇస్తూ చాలా కష్టపడుతుంది. ఇందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రజెంట్ ట్రెండ్ అవుతున్నాయి.
Also Read : War 2 : తప్పించుకున్న అలియా.. బుక్ అయిన కియారా
అనుపమ మాట్లాడుతూ.. ‘‘ఇండస్ట్రీలో హీరోయిన్స్‌గా కొనసాగడం అంత సులభం కాదు. చిన్న విషయాలకే యాటిట్యూడ్ అంటారు. ఉదయం 7 గంటలకు రెడీ అయి షూటింగ్‌కి వెళ్తే.. 9.30కి మాత్రమే పనిని మొదలు పెడతారు. కో-స్టార్స్ ఆలస్యంగా వచ్చినా అది తప్పు కాదు. కానీ నేను అడిగితే మాత్రం పొగరు అంటారు. ఒకప్పుడు దీనివల్ల చాలా బాధపడేదాన్ని.. ఇప్పుడు మాత్రం పట్టించుకోవడం మానేశాను. అదే విషయాన్ని దర్శకనిర్మాతలకు చెప్పినా సరైన స్పందించరు. ‘‘ఆ గంటన్నరలో సినిమా గురించి ఎన్నో విషయాలు మాట్లాడుకోవచ్చు. కానీ హీరోయిన్స్ అడిగితే ‘నా డబ్బులు కదా నీకెందుకు’ అని అంటారు. కానీ ఇదే మాట హీరోలు అడిగితే మాత్రం వారిని ఒక్క మాట కూడా అనరు. మహిళలతో వ్యవహరించే తీరు బయటనే కాదు, ఇండస్ట్రీలో కూడా ఇలానే ఉంటుంది’’ అని అనుపమ స్పష్టం చేశారు. అలాగే ఈ ‘పరదా’ సినిమా విజయం తనకు చాలా ముఖ్యమని, ఇది హిట్ అయితే భవిష్యత్తులో ఇలాంటి మంచి చిత్రాలు మరిన్ని వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
