Site icon NTV Telugu

Anu Emmanuel : ట్రెడిషనల్ లుక్ లో అదరగొట్టిన అను ఇమ్మానుయల్…

Whatsapp Image 2023 06 13 At 9.13.49 Pm

Whatsapp Image 2023 06 13 At 9.13.49 Pm

అను ఇమ్మాన్యుయేల్ తాజాగా చీరకట్టులో అదరగొడుతుంది సంప్రదాయ దుస్తుల్లో ఈ ముద్దుగుమ్మ ఎంతో బ్యూటీఫుల్ గా ఉంది.
ఈ హాట్ హీరోయిన్ రీసెంట్ గా ‘రావణసుర’ చిత్రంతో అలరించిన సంగతి తెలిసిందే. మాస్ రాజా రవితేజ సరసన నటించింది. కానీ ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది.ప్రస్తుతం తన తరువాత సినిమాపై తన ఫోకస్ పెట్టింది. ఎలాగైనా మంచి హిట్ ను దక్కించుకునేందుకు ఈ ముద్దుగుమ్మ బాగా ప్రయత్నిస్తోంది. ఇందుకోసం అటు సినిమాలతో అలరిస్తూనే ఇటు సోషల్ మీడియాలో బాగా సందడి చేస్తోంది. వరుస పోస్టులతో ఆకట్టుకుంటోంది.

అను ఇమ్మాన్యుయేల్ మొదట ఎంతో బొద్దుగా ఉండేది. ఇటీవల స్లిమ్ గా తయారై మరింత అందాన్ని సొంతం చేసుకుంది. సన్నగా తయారవడంతో అదిరిపోయే అవుట్ ఫిట్లు ధరిస్తూ ఫొటోషూట్లు ను చేస్తోంది.కొత్త లుక్స్ తో నెట్టింట సందడి చేస్తోంది.అయితే, ఎప్పుడూ ట్రెండీ వేర్స్ లో గ్లామర్ విందు చేసే ఈ ముద్దుగుమ్మ తాజాగా చీరకట్టులో అదరగొట్టింది . సంప్రదాయ దుస్తుల్లో అను ఇమ్మాన్యుయేల్ మరింత అందాన్ని సొంతం చేసుకుంది. గ్రీన్ శారీలో బొట్టుపెట్టుకొని, మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ను ధరించి బాగా ఆకట్టుకుంది.
చాలా రోజుల తర్వాత అను ఇమ్మాన్యుయేల్ చీరకట్టులో దర్శనమివ్వడంతో ఫ్యాన్స్ బాగా ఖుషీ అవుతున్నారు. ఆమె అందాన్ని తెగ పొగిడేస్తున్నారు.నెటిజన్లు తన అందమైన లుక్ పై కామెంట్లు కూడా పెడుతున్నారు. అలాగే బాగా లైక్స్ కూడా చేస్తున్నారు.అల్లు శిరీష్ సరసన ‘ఉర్వశీవో రాక్షసివో’ చిత్రంలో నటించిన తర్వాత మాస్ రాజా సరసన ‘రావణసుర’లో కూడా గ్లామర్ రోల్ మెరిసింది. బోల్డ్ పెర్ఫామెన్స్ తో బాగా అదరగొట్టింది. ప్రస్తుతం తమిళంలో కార్తీ సరసన ‘జపాన్’సినిమా నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది.వరుస సినిమాలలో నటిస్తున్న కానీ ఈ భామ కి భారీ హిట్ లభించడం లేదు. మరీ ఈ సారి అయిన ఈ అమ్మడికి హిట్ లభిస్తుందో లేదో చూడాలి.

Exit mobile version