NTV Telugu Site icon

Antony: ఆదికేశవ విలన్ ఖాతాలో మరో హిట్..

Joju

Joju

Antony: మలయాళ నటుడు జోజు జార్జ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ఈపాటికే తెలిసి ఉంటుంది. ఇరట్టా అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. నెట్ ఫ్లిక్స్ లో ఆ సినిమా చూసి అభిమానులు జోజు ఎవరు అని సెర్చ్ చేసి మరీ తెలుసుకున్నారు. ఆ నటనకు మెచ్చి.. టాలీవుడ్ కూడా ఆయనను సగర్వంగా ఆహ్వానించింది. వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా నటించిన ఆదికేశవ సినిమాతో జోజు జార్జ్ విలన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయినా.. విలన్ కు మాత్రం బాగానే మార్కులు పడ్డాయి.

Prabhas: దయచేసి ఆ పని చేయకు డార్లింగ్.. సలార్ కు ఎఫెక్ట్ అవుతుంది.. ?

ఇక తాజాగా జోజు జార్జ్ నటించిన కొత్త సినిమా అంథోని డిసెంబర్ 1 న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. జోజు జార్జ్, కల్యాణి ప్రియదర్శన్ , చంబన్ వినోద్ జోష్, నైలా ఉష ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం అంథోని. ఈ సినిమాకు జోషి దర్శకత్వం వహించగా.. ఎయిన్స్టిన్ జాక్ పాల్, సుశీల్ కుమార్ అగర్వాల్, నితిన్ కుమార్, రజత్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మించారు. మూడురోజుల క్రితం రిలీజ్ అయిన ఈ సినిమా దాదాపు రూ. 6 కోట్లు కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది. ఇక ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్ లో “గతంలో నేను ఈ చిత్ర దర్శకుడు జోషి దర్శకత్వంలో వచ్చిన పోరింజు మరియం జోష్ నటుడిగా నాకు మంచి గుర్తింపు తెచ్చింది. అంథోని సినిమా కూడా అదే తరహాలో సక్సెస్ అవ్వడంతో ఆనందంగా ఉందని” చెప్పుకొచ్చాడు. మరి ముందు ముందు జోజు జార్జ్ తెలుగులో కనిపిస్తాడేమో చూడాలి.

Show comments