నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘అంటే సుందరానికీ’. శ్యామ్ సింగరాయ్ తర్వాత నాని అభిమానుల ముందుకు రానున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఇది. ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ పై మేకర్స్ తాజాగా అప్డేట్ అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాలో నాని సరసన నాయికగా నజ్రియా నటించింది. తెలుగులో ఆమెకి ఇదే మొదటి సినిమా. ఈ సినిమాను జూన్ 10వ తేదీన విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ చిత్రం నుంచి ఫస్టు సింగిల్ ను రిలీజ్ చేయడానికి ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు.
ఈ నెల 6వ తేదీన సాయంత్రం 6:03 నిమిషాలకు ‘పంచె కట్టు’ అంటూ సాగే ఫస్టు సింగిల్ ను విడుదల చేయనున్నారు. ఇంతవరకూ ఈ సినిమా నుంచి వచ్చిన అప్ డేట్స్ ఆసక్తిని పెంచుతూ వెళ్లాయి. రీసెంట్ గానే ఈ సినిమా నుంచి నాని క్యారెక్టర్ ను రివీల్ చేస్తూ.. ఓ టీజర్ ని వదిలింది చిత్రబృందం. ఈ టీజర్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. ‘బ్రోచేవారేవరురా’, ‘మెంటల్ మదిలో’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వివేక్ ఆత్రేయ ఈ సినిమాను రూపొందిస్తున్నారు.