Site icon NTV Telugu

Anshu : బ్లాక్ బికినీలో షాక్ ఇచ్చిన.. మన్మథుడు బ్యూటీ అన్షు

Untitled Design

Untitled Design

కొంతమంది హీరోయిన్లు నటించింది ఒక్క సినిమా అయినా ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ గుర్తుండిపోతారు. ఇలాంటి హీరోయిన్ లో అన్షు ఒకరు. ‘మన్మధుడు’ మూవీలో నాగ్ తో జత కట్టి.. తన అమాయకపు చూపులు, ఆకట్టుకునే అందంతో మహేశ్వరిగా అదరగొట్టింది అన్షు. నిజానికి మన్మథుడు సినిమాలో అన్షు కనిపించింది 20, 25 నిమిషాలు మాత్రమే. కానీ ఈ బ్యూటీ చూపిన ఇంపాక్ట్ మాత్రం అంతా ఇంతా  కాదు. ఆమె లుక్ చూసి యూత్ దెబ్బకు పడిపోయారు. మన్మధుడు మూవీ తర్వాత ప్రభాస్ సరసన ‘రాఘవేంద్ర’ సినిమాలో నటించింది ఈ అందాల తార. కానీ ఈ మూవీ అంతగా హిట్ అవ్వలేదు. తర్వాత మళ్ళి నటించలేదు.. సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. పెళ్లి చేసుకొని ఫారిన్ లో సెట్ అయింది. అయితే ఈ మధ్య కాలం తర్వాత రీసెంట్‌గా వచ్చిన మజాకా సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చి మరోసారి ప్రేక్షకుల చూపు తన వైపు తిప్పుకుంది. ఇదిలా ఉంటే..

Also Read : Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – మెహర్ రమేష్ కాంబోలో సినిమా

తాజాగా తన ఫ్యామిలీతో కలిసి బ్లాక్ బికినీలో చిల్ అయిన అన్షు. తన భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి ఆమె సరదాగా ఎంజాయ్ చేసింది. దీంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఈ పిక్స్ చూసి అన్షు ఎంతలా మారిపోయింది? అప్పుడు, ఇప్పుడు సూపర్ అంతే అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. ముఖ్యంగా బికినిలో అన్షు లుక్ చూసి షాక్ అవుతున్నారు.. కాగా, అన్షు సెకండ్ ఇన్సింగ్స్ మొదలు పెట్టడానికి అందుకు తగ్గట్లే ప్లాన్ చేసుకొని సోషల్ మీడియాలో ఘాటైన ఫోటోలు పెడుతుంది ఈ బ్యూటీ.

Exit mobile version