Site icon NTV Telugu

Manchu Mohan Babu: అంత కోపం ఎందుకు మాస్టారూ.. పాపం జయసుధ..

Mohan

Mohan

Manchu Mohan Babu: మంచు మోహన్ బాబు గురించి ప్రత్యేకంగా ఎవరికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన రూటే సపరేటు. అంతకుముందు వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ లా ఉండే మోహన్ బాబు ఈ మధ్య సినిమాలు తగ్గించడమే కాకుండా మీడియా ముందుకు కూడా రావడం లేదు. ఇక ఈ మధ్య మంచు మనోజ్ పెళ్లి తరువాత అస్సలు కనిపించడం కూడా లేదు. ఇక చాలా గ్యాప్ తరువాత మంచు మోహన్ బాబు.. అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి ఉత్సవాల్లో కనిపించాడు. ఇక ఈ ఈవెంట్ లో మోహన్ బాబు ప్రవర్తించిన తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ముఖ్యంగా జయసుధపై ఆయన ఆగ్రహించడం హాట్ టాపిక్ గా మారింది.

Brahmanandam: ఏఎన్నార్ ను ఇమిటేట్ చేసిన బ్రహ్మీ.. ఎంత అద్భుతంగా చేశాడో..

అసలు విషయమేంటంటే.. శతజయంతి వేడుకలకు సినీరాజకీయ ప్రముఖులు విచ్చేశారు. ఇక ఒక్కొక్కరుగా స్టేజిపైకి వెళ్లి ఏఎన్నార్ గురించి మాట్లాడుతున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే స్పీచ్ వినకుండా జయసుధ ఫోన్ నొక్కుతూ కనిపించింది. దీంతో అది చూసిన మోహన్ బాబు ఆమెపై సీరియస్ అయ్యాడు. జయసుధకు చెప్పకుండా ఫోన్ లాక్కొని పక్కన పెట్టి.. స్పీచ్ వినమని సైగచేశాడు. ఇక ఇదంతా రెప్పపాటులో జరిగేసరికి జయసుధకు ఏమి అర్ధం కాలేదు. దీంతో ఆమె ముఖం చిన్నబుచ్చుకొంది. వెంటనే తేరుకొని ఆమె స్పీచ్ వినడం మొదలుపెట్టింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో చూసిన అభిమానులు అంత కోపం ఎందుకు మాస్టారూ.. పాపం జయసుధ..చూడండి ఎలా ముఖం చిన్నబుచ్చుకుందో అని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.

Exit mobile version