Site icon NTV Telugu

Karate Kalyani: ఒక్కొక్కటిగా బయటపడుతున్న కరాటే కళ్యాణి ఆగడాలు..

Karate Kalyani

Karate Kalyani

గత రెండురోజులుగా ఇండస్ట్రీలో కరాటే కళ్యాణి గురించిన వివాదం హాట్ టాపిక్ గా మారిన విషయం విదితమే. ప్రముఖ యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి పై ఆమె దాడి చేయడం, తనను డబ్బులు ఇవ్వమని బలవంతపెడుతుందని శ్రీకాంత్ ఆమెపై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. ఆమె నుంచి తనకు ప్రాణహాని ఉందని శ్రీకాంత్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయమూ విదితమే. ఇక శ్రీకాంత్ ఫిర్యాదుతో కరాటే కళ్యాణి బాధితులు క్యూ కట్టారు. తాము కూడా కరాటే కళ్యాణి బాధితులమని పోలీసులకు ఫిర్యాదు చేయడం ప్రస్తుతం సంచలనంగా మారింది.

వివరాల్లోకివెళితే .. వెంగళరావునగర్‌లో ఉంటున్న కర్నూల్‌కు చెందిన నితేష్‌ అనే వ్యక్తి కరాటే కళ్యాణి నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గతేడాది ఒక యువతీ అత్యాచార కేసులో కళ్యాణి బాధితురాలి పేరు, వివరాలు మీడియా ముందు చర్చిస్తూ ఆవేదన వ్యక్తం చేసిందని, మీడియా ముందు అత్యచార బాధితురాలి పేరు, వివరాలు చెప్పకూడదని, మీరెలా చెప్తారని తాను ప్రశ్నించినట్లు తెలిపారు. దీంతో ఆమె తనపై ఆగ్రహం వ్యక్తం చేసి అసభ్యకరమైన మాటలతో తిట్టేసరికి తాను జగద్గిరి గుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. అప్పటినుంచి ఆమె నాపైనే పోలీస్ కేసు పెడతావా..? నీ అంతు చూస్తాను అంటూ బెదిరిస్తుందని, ఆమె నుంచి తనకు ప్రాణహాని ఉందని మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చెప్పటినట్లు తెలిపారు.

Exit mobile version