NTV Telugu Site icon

Project K: ‘కల్కి’లో యంగ్ హీరో ఫైనలా?

Prabhas Project K First Look

Prabhas Project K First Look

‘సలార్’ రిలీజ్ అయిన ఆరు నెలల తర్వాత ‘కల్కి’ సినిమాతో పాన్ వరల్డ్ రేంజ్‌లో రాబోతున్నాడు ప్రభాస్. ఖచ్చితంగా సలార్‌తో పాటు కల్కి కూడా వెయ్యి కోట్ల బొమ్మ అవుతుందని గట్టిగా నమ్ముతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. అంతేకాదు కల్కి సినిమాతో హాలీవుడ్ గడ్డ పై జెండా పాతేందుకు రెడీ అవుతున్నాడు ప్రభాస్. వైజయంతి బ్యానర్ పై దాదాపు 500 కోట్ల బడ్జెట్‌తో ‘కల్కి’ తెరకెక్కుతోంది. మహానటి తర్వాత యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను ఊహకందని విధంగా రూపొందిస్తున్నాడు. రీసెంట్‌గా రిలీజ్ చేసిన కల్కి గ్లింప్స్‌ అదిరిపోయింది. వచ్చే సమ్మర్‌లో ఈ సినిమా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. దీపిక పదుకొనే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, దిశా పటానీ కీ రోల్ ప్లే చేస్తుండగా.. లోక నాయకుడు కమల్ హాసన్ విలన్‌గా నటిస్తున్నాడు.

నార్త్ నుంచి సౌత్ వరకూ ఉన్న స్టార్ కాస్ట్ తో పాటు కల్కి సినిమాలో మరో యంగ్ హీరో కూడా కీలక పాత్రలో కనిపించనున్నట్టుగా చాలా రోజులుగా ప్రచారంలో ఉంది. అతనెవరో కాదు మళయాళ యంగ్ సూపర్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ అనే టాక్ కూడా ఉంది. గతంలో వైజయంతి బ్యానర్ నిర్మించిన సీతారామం సినిమా సాలిడ్ హిట్ అందుకుంది. అందుకే ‘కల్కి’లో దుల్కర్ కామియో ఉండే ఛాన్స్ ఉందనే టాక్ ఉంది. లేటెస్ట్ అప్డేట్ మాత్రం దుల్కర్ దాదాపుగా ఫైనల్ అయ్యాడని చెబుతోంది. అంతేకాదు ఈ సినిమాలో దుల్కర్ రోల్‌ కథను మలుపు తిప్పేలా ఉంటుందట. సెకండ్ హాఫ్‌లో కీలక పాత్రలో ఓ 10 నిమిషాలు కనిపించనున్నాడట దుల్కర్. ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు గానీ ఒకవేళ దుల్కర్ ‘కల్కి’లో ఉంటే మాత్రం ఈ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ కి సౌత్ లో మరింత వెయిట్ పెరిగినట్టే.