Project K: ‘కల్కి’లో యంగ్ హీరో ఫైనలా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘సలార్’ రిలీజ్ అయిన ఆరు నెలల తర్వాత ‘కల్కి’ సినిమాతో పాన్ వరల్డ్ రేంజ్‌లో రాబోతున్నాడు ప్రభాస్. ఖచ్చితంగా సలార్‌తో పాటు కల్కి కూడా వెయ్యి కోట్ల బొమ్మ అవుతుందని గట్టిగా నమ్ముతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. అంతేకాదు కల్కి సినిమాతో హాలీవుడ్ గడ్డ పై జెండా పాతేందుకు రెడీ అవుతున్నాడు ప్రభాస్. వైజయంతి బ్యానర్ పై దాదాపు 500 కోట్ల బడ్జెట్‌తో ‘కల్కి’ తెరకెక్కుతోంది. మహానటి తర్వాత యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను ఊహకందని విధంగా రూపొందిస్తున్నాడు. రీసెంట్‌గా రిలీజ్ చేసిన కల్కి గ్లింప్స్ అదిరిపోయింది. వచ్చే సమ్మర్‌లో ఈ సినిమా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. దీపిక పదుకొనే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, దిశా పటానీ కీ రోల్ ప్లే చేస్తుండగా.. లోక నాయకుడు కమల్ హాసన్ విలన్‌గా నటిస్తున్నాడు.
నార్త్ నుంచి సౌత్ వరకూ ఉన్న స్టార్ కాస్ట్ తో పాటు కల్కి సినిమాలో మరో యంగ్ హీరో కూడా కీలక పాత్రలో కనిపించనున్నట్టుగా చాలా రోజులుగా ప్రచారంలో ఉంది. అతనెవరో కాదు మళయాళ యంగ్ సూపర్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ అనే టాక్ కూడా ఉంది. గతంలో వైజయంతి బ్యానర్ నిర్మించిన సీతారామం సినిమా సాలిడ్ హిట్ అందుకుంది. అందుకే ‘కల్కి’లో దుల్కర్ కామియో ఉండే ఛాన్స్ ఉందనే టాక్ ఉంది. లేటెస్ట్ అప్డేట్ మాత్రం దుల్కర్ దాదాపుగా ఫైనల్ అయ్యాడని చెబుతోంది. అంతేకాదు ఈ సినిమాలో దుల్కర్ రోల్ కథను మలుపు తిప్పేలా ఉంటుందట. సెకండ్ హాఫ్‌లో కీలక పాత్రలో ఓ 10 నిమిషాలు కనిపించనున్నాడట దుల్కర్. ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు గానీ ఒకవేళ దుల్కర్ ‘కల్కి’లో ఉంటే మాత్రం ఈ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ కి సౌత్ లో మరింత వెయిట్ పెరిగినట్టే.
Also Read
- Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
- Bobby Deol: అప్పటివరకు సరైన హిట్ లేదు.. ‘యానిమల్’తో ఓవర్‌నైట్ సెన్సేషన్.. ఇప్పుడు ఆ ఇమేజ్‌పై పోరాటం!
- Drishyam 4: జార్జ్‌కుట్టి కథకు మరో ట్విస్ట్.. ‘దృశ్యం 4’ను అధికారికంగా ప్రకటించిన మేకర్స్!
- Niu Lai Box Office: స్టార్లు లేరు.. భారీ బడ్జెట్ లేదు.. అయినా రూ.కోట్ల వసూళ్లు! ఈ చిన్న సినిమా రచ్చ మామూలుగా లేదుగా..
తాజావార్తలు
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
-
Bobby Deol: అప్పటివరకు సరైన హిట్ లేదు.. ‘యానిమల్’తో ఓవర్‌నైట్ సెన్సేషన్.. ఇప్పుడు ఆ ఇమేజ్‌పై పోరాటం!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!