దర్శకుడు శివ నిర్వాణ తొలి చిత్రం ‘నిన్ను కోరి’. మలి చిత్రం ‘మజిలీ’. ఈ రెండు సినిమాలు డీసెంట్ హిట్స్ ను అందుకున్నాయి. అయితే… తాజాగా వచ్చిన ‘టక్ జగదీశ్’ మాత్రం ఓటీటీ ద్వారా విడుదలై ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది. ఇదే విషయాన్ని ఇవాళ ఇన్ డైరెక్ట్ గా దర్శకుడు శివ నిర్వాణ సైతం అంగీకరించాడు. వైజాగ్ బీచ్ నుండి ఆయనో 40 సెకన్ల చిన్న వీడియోను షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తన ‘నిన్ను కోరి, మజిలి’ చిత్రాలను ప్రేక్షకులు మనసుల్లోకి తీసుకున్నారని, ఆ స్ఫూర్తితో తాజాగా నాలుగో చిత్రంగా మరో ప్రేమకథను అందించబోతున్నానని శివ నిర్వాణ తెలిపాడు. సముద్రం, కెరటాలు ఎంత ఒరిజినల్ గా ఉంటాయో… తన కొత్త సినిమా కథ కూడా అంతే ఒరిజినల్ గా ఉంటుందని శివ నిర్వాణ చెబుతున్నాడు. మరి ఈ సినిమాను అతను ఎవరితో చేస్తాడో… ఏ సంస్థ దీనిని నిర్మిస్తుందో వేచి చూడాలి.
శివ నిర్వాణ నుండి మరో లవ్ స్టోరీ!
