Site icon NTV Telugu

Bollywood : జాన్వీ, ఖుషీ కపూర్ కు పోటీగా మరో కపూర్ కూతురు

Bollywood

Bollywood

కపూర్ ఫ్యామిలీ నుండి మరో హీరోయిన్ బాలీవుడ్ తెరంగేట్రానికి సిద్దమైంది. ఫస్ట్ సినిమా రిలీజ్ కాకుండానే ఆఫర్లు కొల్లగొడుతోంది శనయ కపూర్. ఆమె లైనప్ చూస్తే జాన్వీ, ఖుషీలకు గట్టి పోటీ ఇచ్చేట్లే కనిపిస్తోంది. కరణ్ జోహార్ సోల్ మూవీస్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్, స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 నుండి సీక్వెల్ రాబోతుంది. ఈ ప్రాజెక్టులోకి స్టెప్ ఇన్ కాబోతుంది శనయ. బోనీ కపూర్ సోదరుడు సంజయ్ కపూర్ కూతురే శనయ.

Also Read : Priya Prakash Varrier : మొత్తానికి హిట్టు రుచి చూసిన ప్రియా ప్రకాష్

2022లోనే ధర్మ ప్రొడక్షన్‌లో బేధక్ మూవీతో ఇంట్రడ్యూస్ కావాల్సి ఉండగా ఇంకా విడుదలకు నోచుకోలేదు. సినిమా ఉందో షెడ్డుకు వెళ్లిందో కూడా తెలియని సిచ్యుయేషన్. క్యారెక్టర్ పోస్టర్స్ తప్ప ఇంకో అప్డేట్ లేదు. లేటైనా లేటెస్టుగా ప్రాజెక్టులను క్యాప్చర్ చేస్తోంది కపూర్ నయా బ్యూటీ. ఆఖోంకీ గుస్తాకీయాలో విక్రాంత్ మాస్సేతో నటిస్తోంది. తు మే యాన్ అనే సర్వైవల్ థ్రిల్లర్ మూవీ చేస్తోంది. నెక్ట్స్ ఇయర్ వాలంటైన్స్ డేకి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలాగే మోహన్ లాల్ వృషభలోనూ కనిపించబోతుంది శనయ. ఇప్పుడు స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 3లో కన్ఫర్మ్ అయినట్లు టాక్. అయితే ఇది సినిమాగా కాకుండా సిరీస్‌గా తెరకెక్కించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట కరణ్ జోహార్. ఆరు ఎపిసోడ్లగా సిరీస్ రాబోతుందన్నది టాక్. ఈ నెలలో షూటింగ్ స్టార్ట్ చేసి ఫాస్టుగా షూటింగ్ కంప్లీట్ చేసి ఓటీటీలోకి రిలీజ్ చేస్తారట మేకర్స్. ఈ లెక్కన చూస్తే స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 3తోనే తెరంగేట్రం ఇవ్వబోతుంది శనయ.

Exit mobile version