Site icon NTV Telugu

మెగా 154: రవితేజ ప్లేస్‌లో మరో హీరో..!

Mega 154

Mega 154

 

రీసెంట్‌గా ఖిలాడిగా ఆకట్టుకోలేకపోయిన రవితేజ.. ఈసారి రామారావుగా హిట్ కొట్టేందుకు రెడీ అవుతున్నాడు. శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రామారావు అన్ డ్యూటీ’ జూలై 29న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమాతో పాటు ధమాకా..రావణాసుర.. టైగర్ నాగేశ్వరరావు.. సినిమాలు కూడా చేస్తున్నారు మాస్ మహారజా. ప్రస్తుతం ఈ సినిమాలన్నీ సెట్స్ పై ఉన్నాయి. అయితే వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న రవితేజ.. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మెగాస్టార్ 154వ సినిమాలోను.. కీలక పాత్రలో నటిస్తున్నాడని చాలా రోజులుగా వినిపిస్తోంది. ఇప్పటికే రవితేజకు సంబంధించిన షెడ్యూల్ కూడా ప్లాన్ చేశారని వార్తలొచ్చాయి. అందుకోసం రవితేజ భారీ రెమ్యునరేషన్ కూడా అందుకోబోతున్నాడని వినిపించింది. అయితే ఆ మధ్యలో బడ్జెట్ కంట్రోల్ కోసం ఈ సినిమాలో రవితేజను తీసుకోవడం లేదనే టాక్ కూడా వచ్చింది. కానీ అలాంటి వార్తల్లో వాస్తవం లేదని తెలిసింది. కానీ తాజాగా మళ్లీ ఇదే వార్త వైరల్‌గా మారింది.

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. రవితేజ మెగా 154 ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు గానీ.. ప్రస్తుతం దర్శకుడు బాబీ రవితేజ స్థానాన్ని రీప్లేస్ చేసే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే మరో హీరో కోసం వెతుకుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఒకరిద్దరు హీరోలను కూడా సంప్రదించినట్లు సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే.. రవితేజ ప్లేస్‌లో ఈ హీరోని తీసుకోబోతున్నారు.. అసలు ఈ ప్రాజెక్ట్ నుంచి రవితేజ ఎందుకు తప్పుకున్నాడు.. అసలు కారణాలేంటనేది.. చర్చనియాంశంగా మారింది. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ రానుందని అంటున్నారు. ఇక శృతిహాసన్ హీరోయిన్‌గా.. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న మెగా 154.. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు ఇటీవలే ప్రకటించారు. అన్నట్టు ఈ చిత్రానికి ‘వాల్తేరు వీరయ్య’ అనే టైటిల్ పరిశీలినలో ఉంది.

Exit mobile version