NTV Telugu Site icon

Sandal Wood : మరో వివాదం.. కోర్టు మెట్లెక్కిన కన్నడ స్టార్ హీరోయిన్

Ramya

Ramya

కన్నడ నటీనటుల వ్యవహారం ఇటీవల తీవ్ర వివాదాస్పదంగా మారుతోంది. రకరకాల గొడవలతో కోర్టు మెట్లు ఎక్కడం టాక్ ఆఫ్ ది సౌత్ సినిమాగా మారింది. తాజాగా సీనియర్ నటి కమ్ పొలిటీషియన్ రమ్య వార్తల్లో కెక్కింది. కన్నడి మాజీ హీరోయిన్ కమ్ పొలిటీషియన్ రమ్య కర్ణాటలోని కమర్శియల్ కోర్టును ఆశ్రయించారు. తన అనుమతి లేకుండా ట్రైలర్, సినిమాలో వినియోగించిన తన సన్నివేశాలను తొలగించాలంటూ కన్నడ నటి, మైసూరు మాజీ ఎంపీ రమ్య న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ‘హాస్టల్ హుడుగరు బేకాగిద్దారే’ మూవీలో తన పర్మిషన్ లేకుండా తన సన్నివేశాలను వాడుకున్నారని పేర్కొంటూ రమ్య కమర్షియల్ కోర్టును ఆశ్రయించింది.

Also Read : Nidhhi Agerwal : సోషల్ మీడియాలో వేధిస్తున్న వ్యక్తిపై కేసు పెట్టిన నిధి అగర్వాల్

‘హాస్టల్ హుడుగరు బేకాగిద్దారే’ మూవీ నుంచి తన వీడియోలు తొలగించడంతోపాటు కోటి రూపాయల పరిహారం ఇప్పించాలని న్యాయస్థానాన్ని కోరారు. సినిమాలో వాడుకున్న తన వీడియోలను తొలగించాలని చిత్ర నిర్మాతలను పలుమార్లు కోరినా స్పందించలేదని తెలిపారు. వాటిని తొలగిస్తే కేసు వెనక్కి తీసుకుంటానని చెబుతుంది. అయితే 2023లో వచ్చిన ఈసినిమా కోసం రమ్య ఇప్పుడు తన ఫైట్ ను ఉద్రుతం చేయడం ద్వారా ఆమెకొచ్చిన బెనిఫిట్ ఏంటో ఓ పట్టాన ఎవ్వరికీ అర్ధం కావడం లేదు. నితిన్ కృష్ణమూర్తి దర్శకత్వం వహించిన ‘హాస్టల్ హుడుగరు బేకాగిద్దారే’ బ్లాక్ కామెడీ, డ్రామా మూవీ. ఈ సినిమా విడుదలను ఆపాలని రమ్య గతంలో కోర్టును ఆశ్రయించినా, ఆమె పిటిషన్‌ను కొట్టివేయడంతో సినిమా సాఫీగా విడుదలైంది. అయితే తాజాగా ఆమె కోర్టు మెట్లెక్కడంతో ఈ వివాదం ఇప్పటితో ఆగేలా లేదని చర్చించుకుంటున్నాయి కన్నడ సినీ వర్గాలు.

Show comments