NTV Telugu Site icon

Annapoorani: బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి.. ఆ పని చేయడం తగునా నయన్.. ?

Nayan

Nayan

Annapoorani: టైటిల్ చూసి తెగ కంగారుపడిపోకండి.. అదేంటి నయన్ బ్రాహ్మణ అమ్మాయి కాదుగా అని తలలు బద్దలు కొట్టుకోకండి. అది కేవలం.. సినిమాలోని పాత్ర మాత్రమే. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న నయన్.. తాజాగా నటిస్తున్న చిత్రం అన్నపూర్ణి. ది గాడెస్ ఆఫ్ ఫుడ్ అనేది ట్యాగ్ లైన్. నీలేష్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని
జీ స్టూడియోస్, ట్రైడెంట్ ఆర్ట్స్ మరియు నాద్ ఎస్ఎస్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో జై హీరోగా నటిస్తుండగా.. సత్యరాజ్. కేఎస్ రవికుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నయన్.. 75 వ చిత్రంగా తెరక్కనున్న ఈ సినిమాపై ప్రేక్షకులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్ టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ వీడియో ఆద్యంతం ఆకట్టుకొంటుంది.

Dhruva Natchathiram: లేట్ గా వస్తున్నా.. లేటెస్ట్ గా హిట్ అయ్యే కంటెంట్ ఉన్నట్లుందే

మరి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన అమ్మాయి అన్నపూర్ణి. ఇంట్లో మడి, ఆచారాలు ఎక్కువ. కానీ, ఆమెకు మాత్రం చెఫ్ అవ్వాలన్నది కోరిక. నాన్ వెజ్ వంటకాలను తయారుచేసి.. రెస్టారెంట్ ఓపెన్ చేయాలన్నది ఆమె డ్రీమ్. అయితే ఆ విషయం ఇంట్లో చెప్పకుండా ఆమె చేసే ప్రయత్నాలు ఏంటి అనేదే ఈ సినిమా కథగా తెలుస్తోంది. నాన్ వెజ్ ను కనీసం చేతితో కూడా ముట్టని కుటుంబంలో పుట్టి.. ఒక మాస్టర్ చెఫ్ గా అన్నపూర్ణి ఎలా ఎదిగింది అనేది వినోదాత్మకంగా చూపించనున్నాడట నీలేష్. ఇక నయన్ లుక్ .. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన అమ్మాయిలానే అనిపిస్తుంది. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతుంది. మరి ఈ సినిమాతో నయన్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Show comments