Annapoorani: లేడీ సూపర్ స్టార్ ప్లాప్ సినిమా.. ఎట్టకేలకు ఓటిటీలోకి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Annapoorani: లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ ఏడాది జవాన్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న విషయం తెల్సిందే. ఈ సినిమా తరువాత నయన్.. అన్నపూరణి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నీలేశ్ కృష్ణ తెరకెక్కించిన ఈ సినిమాలో జర్నీ ఫేమ్ జై, సత్యరాజ్, అచ్యుత్ కుమార్, కే ఎస్ రవి కుమార్, రెడిన్ కింగ్‌స్లే, రేణుకు, కార్తీక్ కుమార్, పూర్ణిమా రవి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్, నాట్ స్టూడియోస్, ట్రైడెంట్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించాయి. డిసెంబర్ 1 న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ పరాజయాన్ని చవిచూసింది. అందుకు కారణాలు కూడా లేకపోలేదు. ఆ సమయంలోనే తమిళనాడును వరదలు ముంచెత్తాయి. ఇక తిండికి కూడా కష్టంగా మారిన ఆ సమయంలో సినిమాను చూడడానికి ఎవరు వస్తారు. అందుకే ఈ చిత్రం భారీ పరాజయం అందుకుంది. ఇదే కాకుండా ఈ సినిమా రిలీజ్ కు ముందే వివాదంగా నిలిచింది.
ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన అమ్మాయి.. చెఫ్ గాఎదగడానికి నాన్ వెజ్ ను వండడం, తినడం.. దీనివలన ఆ అమ్మాయి కుటుంబం అగ్రహారంలో పరువును పోగొట్టుకోవడం అనేది చూపించారు. దీంతో బ్రాహ్మణ సంఘం ఈ సినిమా రిలీజ్ కు అడ్డుపడింది. అయినా రిలీజ్ చేసినా కూడా ఫలితం దక్కలేదు. ఇక నెలరోజుల్లోపే ఈ సినిమా ఓటిటీలోకి అడుగుపెడుతుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ అన్న పూరణి సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. డిసెంబర్ 29 నుంచి లేడీ సూపర్ స్టార్ మూవీ ఓటీటీలోకి రానుంది. తమిళ్‌తో పాటు తెలుగు, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లోనూ నయన తార సినిమా స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా తెలిపారు. మరి ఓటిటీలో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
Also Read
- Shaque: అనుమానాలతో పిచ్చెక్కించడానికి వస్తున్న పరిణీతి చోప్రా మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
- JrNTR : ఆదర్శకుటుంబానికి తోడుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్
- Mirzapur The Movie: థియేటర్లలో ‘మిర్జాపూర్’ మాస్ జాతర!.. మూడు రోజుల్లోనే రూ.100 కోట్లకు..
- Ameesha Patel: ‘ఆంటీ’ అంటూ ట్రోల్.. హార్దిక్‌తో లింకప్ రూమర్స్‌పై అమీషా స్ట్రాంగ్ కౌంటర్!
తాజావార్తలు
-
CM Vijay: పోలీసులు పవర్ సెంటర్‌గా మారొద్దు.. తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ కీలక వ్యాఖ్యలు
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
CM Revanth: కమ్యూనిస్టుల పోరాటం.. కాంగ్రెస్ పరిష్కారం.! సీఎం కీలక వ్యాఖ్యలు..
-
Shaque: అనుమానాలతో పిచ్చెక్కించడానికి వస్తున్న పరిణీతి చోప్రా మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
Best Scooters for Women: మహిళలకు బెస్ట్ స్కూటర్లు ఇవే.. స్టైలిష్ లుక్, మంచి మైలేజ్‌తో అదిరిపోయే మోడల్స్!
ట్రెండింగ్
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!
-
990 గ్రా.లకే ThinkBook..! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్‌తో Lenovo IdeaPad Vibe సిరీస్ వచ్చేసింది.!
-
JIO: అదిరిపోయే ఆఫర్.. 5TB క్లౌడ్ స్టోరేజ్, 18 నెలల AI సబ్స్క్రిప్షన్, 2.5GB డైలీ డేటాతో ఏడాదిపాటు..!