Site icon NTV Telugu

దసరాకు సూపర్ స్టార్ ‘అన్నాత్తే’ కానుక

Annaatthe Teaser is releasing on Oct 14

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నెక్స్ట్ మూవీ ‘అన్నాత్తే’. రజినీకాంత్ ప్రస్తుతం శివ దర్శకత్వంలో “అన్నాత్తే” అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ భారీ ప్రాజెక్ట్‌ను సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఇంతకుముందు రజనీకాంత్ సూపర్ హిట్‌ సినిమాలు ఎందిరన్, పెట్టా లను కూడా ఈ బ్యానర్ పైనే నిర్మించారు. ఇక ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో పాటు ఖుష్బూ, మీనా, నయనతార, కీర్తి సురేష్, ప్రకాష్ రాజ్, జగపతి బాబు, సూరి, సతీష్, బాల (దర్శకుడు శివ సోదరుడు) వంటి ప్రముఖులు ప్రధాన పాత్రలలో నటించారు. డి ఇమ్మాన్ సంగీతం అందించారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.

Read Also : నిర్మాత, ఎన్టీఆర్ పి.ఆర్.వో మహేశ్ కోనేరు హఠాన్మరణం

జాతీయ అవార్డు గెలుచుకున్న మరో నటి కీర్తి సురేష్ ఈ చిత్రంలో రజనీకాంత్ సోదరి పాత్రలో కనిపించనుంది. దీపావళికి విడుదల కానున్న ఈ సినిమా మేకర్స్ ప్రమోషన్ కార్యకలాపాలు మొదలుపెట్టారు. ప్రస్తుతం మేకర్స్ ‘అన్నాత్తే’ టీజర్ విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ‘అన్నాత్తే’ను టీజర్ అక్టోబర్ 14 న సాయంత్రం 6 గంటలకు విడుదల చేస్తామంటూ అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాలో గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన చివరి పాట ఉండడం గమనార్హం.

Exit mobile version