Site icon NTV Telugu

NBK108: విలన్‌గా తెలుగు హీరోయిన్..?

Anjali Villain In Nbk108

Anjali Villain In Nbk108

అనిల్ రావిపూడి, బాలయ్య కలయికలో NBK108 రూపొందనున్న విషయం తెలిసిందే! ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకి వెళ్ళడానికి ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ, అప్పుడే పలు ఆసక్తికరమైన అప్డేట్స్ బయటకు వచ్చేశాయి. ఓ తండ్రి, కూతురు చుట్టూ ఈ సినిమా కథ అల్లుకుని ఉంటుందని.. బాలయ్య తండ్రి పాత్రలో కనిపించనుండగా, పెళ్లిసందD ఫేమ్ శ్రీలీలా కూతురిగా నటించనుందని స్వయంగా అనిల్ రావిపూడి ‘ఎఫ్3’ ప్రమోషన్స్‌లో రివీల్ చేశాడు.

కొన్ని రోజుల తర్వాత ఇందులో బాలయ్య సరసన ప్రియమణిని కథానాయికగా ఎంపిక చేయనున్నట్టు వార్తలొచ్చాయి. అనంతరం మాస్ మహారాజా రవితేజ ఇందులో ఓ కీలక పాత్ర పోషించనున్నాడన్న ప్రచారం జోరుగా జరిగింది. ఈ రెండు వార్తలపై ఇంకా అధికార ప్రకటన రావాల్సి ఉండగా.. తాజాగా మరో కొత్త రూమర్ వెలుగులోకి వచ్చింది. ఈ చిత్రంలో తెలుగు హీరోయిన్ అంజలి బాలయ్య సరసన ఓ ముఖ్య పాత్రలో కనిపించనుందని.. అయితే ఆ రోల్ నెగెటివ్ షేడ్స్ కలిగి ఉంటుందని టాక్ వినిపిస్తోంది. అంటే, అంజలి విలన్ రోల్ చేయనుందన్నమాట! అయితే, ఇది నిజమా? కాదా? అనేది ఇంకా తేలాల్సి ఉంది.

ఇదిలావుండగా.. అనిల్ రావిపూడి ఇంతవరకూ ఒక్క ఓటమి చవిచూడక పోవడం, బాలయ్య ఫుల్ స్వింగ్‌లో ఉండడంతో.. వీరి కలయికలో రానున్న NBK108పై భారీ అంచనాలున్నాయి. అనిల్ సైతం ఈసారి తాను తన శైలిని పక్కన పెట్టి, బాలయ్య కోసం సరికొత్త ప్రయోగం చేస్తున్నానని చెప్పి.. సినిమాపై అంచనాలు మరింత పెంచేశాడు. ఇందులో కామెడీ కంటే, యాక్షన్‌కే పెద్ద పీట వేసినట్టు తెలిపాడు. దీంతో, ఈ సినిమా ఎలా ఉంటుందా? అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

Exit mobile version