NTV Telugu Site icon

Anirudh: న్యూజెర్సీలో ‘ఎన్టీఆర్ 30’ మ్యూజిక్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన అనిరుద్

Anirudh

Anirudh

ప్రస్తుతం ఇండియాలో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైనా ఉన్నారా అంటే అది ‘అనిరుద్’ మాత్రమే. హీరోలు, దర్శక నిర్మాతలే కాదు హీరోల అభిమానులు కూడా అనిరుద్ మ్యూజిక్ కావాలి అని అడుగుతున్నారు అంటే అనిరుద్ క్రేజ్ ఏ రేంజులో ఉందో అర్ధం చేసుకోవచ్చు. రజినీకాంత్, కమల్ హాసన్, విజయ్, అజిత్, సూర్య, ధనుష్, శివ కార్తికేయన్, సేతుపతి లాంటి తమిళ హీరోలతో పాటు నాని, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ లాంటి తెలుగు హీరోలకి, షారుఖ్ ఖాన్ లాంటి బాలీవుడ్ హీరో సినిమాకి కూడా మ్యూజిక్ ఇస్తూ అనిరుద్ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఏ స్టార్ హీరో సినిమా, ఏ దర్శకుడితో అనౌన్స్ అయినా మ్యూజిక్ డైరెక్టర్ మాత్రం అనిరుద్ ఉండాలి అని అభిమానులు కోరుకునే వరకూ వచ్చిన అనిరుద్, సినిమాల బిజీలో కూడా మ్యూజిక్ టూర్స్ కండక్ట్ చేస్తూ ఉంటాడు. #OnceuponATime అంటూ అనిరుద్ చేసే మ్యూజికల్ కాన్సర్ట్స్ కి హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంటుంది.

గతనెల సింగపూర్ వెళ్లిన అనిరుద్, ఈ మంత్ మ్యూజికల్ టూర్ ని అమెరికాలో చేస్తున్నాడు. తన సూపర్ హిట్ సాంగ్స్ తో, థీమ్ మ్యూజిక్ తో ఫాన్స్ ని ఎంటర్టైన్ చేసే అనిరుద్ న్యూజెర్సీలో తెలుగు పాటలతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. అజ్ఞాతవాసి సినిమాలోని సాంగ్స్ ని పాడి ఈవెంట్ కి వచ్చిన తెలుగు ఆడియన్స్ ని ఖుషీ చేసిన అనిరుద్, ఎన్టీఆర్ 30 థీమ్ మ్యూజిక్ ప్లే చేసి రచ్చ లేపాడు. వస్తున్నా అంటూ ఎన్టీఆర్ డైలాగ్ చెప్పిన తర్వాత అనిరుద్ కొట్టిన స్కోర్, ‘ఎన్టీఆర్ 30’ మోషన్ పోస్టర్ కే హైలైట్ అయ్యింది. అదే మ్యూజిక్ ని లైవ్ కాన్సర్ట్ లో అనిరుద్ ప్లే చేశాడు. ఈ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని అనిరుద్ ప్లే చెయ్యగానే ఆడిటోరియం అంతా జై ఎన్టీఆర్ స్లోగన్స్ తో మారుమొగిపోయింది. అరవింద సమేత వీర రాఘవ సినిమాకి మ్యూజిక్ చేసే ఛాన్స్ మిస్ అయిన అనిరుద్, మరి ఈసారి ఎన్టీఆర్ కి పాన్ ఇండియా రేంజులో ఎలాంటి మ్యూజిక్ ఇస్తాడో చూడాలి.

Show comments