NTV Telugu Site icon

Animal: యానిమల్ లో రష్మికను డామినేట్ చేసిన భామ ఎవరో తెలుసా?

Tripti Dimri Rashmika Mandanna

Tripti Dimri Rashmika Mandanna

Animal Tripti Dimri Became Hot Topic: యానిమల్ సినిమా డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాలో రణబీర్ కపూర్ హీరోగా నటించగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమాలో మరో కీలక పాత్రలో నటించిన బాలీవుడ్ నటి తృప్రి డిమ్రీ హాట్ టాపిక్ అయింది. హీరోయిన్ రష్మిక కంటే ఈ బాలీవుడ్ నటి తృప్రి డిమ్రీ గురించే సోషల్ మీడియాలో ఎక్కువ చర్చ జరుగుతోంది. ఈ భామ ముందు నుంచే బాలీవుడ్‌లో కుర్రకారుకు నిద్ర లేకుండా చేసేది. ఆమె అసలు పేరు లైలా తృప్తి డిమ్రీ కాగా ఆమెను ఓటీటీ అభిమానులు బుల్బుల్‌ అంటారు.

800 The Movie: సైలెంటుగా ఓటీటీలోకి వచ్చేసిన ముత్తయ్య 800.. ఫ్రీగా ఎక్కడ చూడాలంటే?

ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్‌లో ఎయిర్‌ ఇండియా ఉద్యోగి దినేష్‌ డిమ్రీకి జన్మించింది. 2017లో ‘పోస్టర్‌ బాయ్స్‌’ సినిమాతో స్క్రీన్‌ ఎంట్రీ ఇచ్చిన తృప్తి 2018లో రొమాంటిక్‌ మూవీ ‘లైలా–మజ్ను’లోని లైలా పాత్రతో ప్రేక్షకుల మనసులు కొల్లగొట్టింది. 2020లో హారర్‌ అండ్‌ థ్రిల్లర్‌ ‘బుల్బుల్‌’ల్‌తో ఓటీటీ స్టార్‌గా మారిన ఆమె ఆ సినిమా నిర్మాత కర్నేష్ తో డేటింగ్ ఊహాగానాలతో వార్తల్లో నిలిచింది. అయితే వీరిద్దరూ తమ రిలేషన్ షిప్ గురించి ఎప్పుడూ బహిరంగంగా మాట్లాడలేదు కానీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఇప్పుడే మా ప్రయాణం మొదలైంది, ఇది మాత్రమే ఇప్పుడు చెప్పగలనని పెళ్లికి ఇంకా 7-8 సంవత్సరాలు పడుతుందని చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఆమె యానిమల్ సినిమాలో నటించిన పాత్రకు గాను మంచి గుర్తింపు తెచ్చుకునే అవకాశం కనిపిస్తోంది. నిజానికి ఈ పాత్ర చేసింది ఎవరో అని ఇప్పుడు సోషల్ మీడియాలో అందరూ సెర్చ్ చేస్తున్నారు.