బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో తెరకెక్కిన ‘యానిమల్’ మూవీ గత ఏడాది డిసెంబర్ లో రిలీజ్ అయి దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమాకు ప్రశంసలు కంటే విమర్శలే ఎక్కువగా వచ్చాయి.అయినా కూడా కలెక్షన్స్ విషయంలో ‘యానిమల్ ‘ మూవీ దుమ్మురేపింది.. ఇదిలా ఉంటే ‘యానిమల్’ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కనున్న ‘యానిమల్ పార్క్’ గురించి ఒక ఆసక్తికరమైన అప్డేట్ బయటికొచ్చింది.. తాజా సమాచారం ప్రకారం ‘యానిమల్ పార్క్’కు సంబంధించిన బేసిక్ స్క్రిప్ట్ పూర్తయ్యిందట. ఇక ఈ స్క్రిప్ట్ పనిని పూర్తిస్థాయిలో ముగించడం కోసం రైటర్స్ తో కలిసి సందీప్ సమావేశం అవ్వనున్నట్లు సమాచారం.ఈ ఏడాది చివరిలోపు స్క్రిప్ట్ పనులు దాదాపుగా ఫైనల్ చేయాలనే ఆలోచనలో దర్శకుడు ఉన్నట్టు తెలుస్తోంది. ఇక స్క్రిప్ట్ పూర్తయినా కూడా రణబీర్ కపూర్ డేట్స్ అందుబాటులో ఉండడం ముఖ్యం. ప్రస్తుతం రణబీర్ కపూర్.. నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రామాయణ’లో నటిస్తున్నట్టు సమాచారం.‘యానిమల్’ కథను రాసుకున్నప్పుడే.. ‘యానిమల్ పార్క్’కు సంబంధించిన బేసిక్ కథ పూర్తయినట్టు సమాచారం. కానీ దానిని పూర్తిస్థాయి స్క్రిప్ట్ గా మార్చడానికి మరికాస్త సమయం పడుతుంది.
ఇక ‘యానిమల్ పార్క్’ బేసిక్ కథ.. ఇది రణబీర్ కపూర్ క్యారెక్టర్ అయిన రణవిజయ్ సింగ్ కి , తనలాగే కనిపించే విలన్ కి మధ్య జరిగే వైలెన్స్ పై ఆధారపడి ఉంటుంది. దాంతో పాటు రణవిజయ్ పాత్రకు, తన భార్య గీతాంజలి మరియు వాళ్ల కొడుకుకు మధ్య రిలేషన్షిప్ ని కూడా ‘యానిమల్ పార్క్’లో మరింత స్పష్టంగా చూపించబోతున్నాడట . ప్రస్తుతం రణబీర్ కపూర్ ‘రామాయణ’పై ఫోకస్ చేస్తుండగా సందీప్ ప్రభాస్ నటిస్తున్న ‘స్పిరిట్’మూవీ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీ కానున్నట్లు సమాచారం.‘కల్కి 2898 ఏడీ’ మూవీ షూటింగ్ చివరిదశకు చేరుకోవడంతో ‘రాజా సాబ్’తో పాటు ‘స్పిరిట్’ షూటింగ్ ను కూడా ఒకేసారి చేసేయాలనే ఆలోచనలో ప్రభాస్ ఉన్నట్టు సమాచారం.. ఒకవేళ అదే జరిగితే సందీప్ సోదరుడు ప్రణయ్ వంగా ‘యానిమల్ పార్క్’ స్క్రిప్ట్స్ పై దృష్టిపెట్టనున్నాడు. రైటర్స్ తో కలిసి స్క్రిప్ట్ను పూర్తిచేసే విషయంలో ప్రణయ్ సాయం చేయనున్నాడని తెలుస్తోంది.ప్రస్తుతం వస్తున్న న్యూస్ ను బట్టి ‘యానిమల్ పార్క్’ షూటింగ్ 2025లో ప్రారంభం కానుందని సమాచారం.