బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ ఇటీవలే ఒక ఇంటివాడైన సంగతి తెల్సిందే. అలియా భట్ తో ఏప్రిల్ 14 న రణబీర్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. మూడేళ్ళ ప్రేమకు వివాహంతో ఈ జంట ఫుల్ స్టాప్ పెట్టింది. ఇక ప్రస్తుతం ఈ జంట హనీమూన్ వెకేషన్ ని ఎంజాయ్ చేస్తోంది అనుకొనేలోపు ఎవరికి వారు తమ షూటింగ్ సెట్లో వాలిపోయి వర్క్ మోడ్ లోకి దిగిపోయారు. ఇక ప్రస్తుతం రణబీర్ పాన్ ఇండియా సినిమా అయినా యానిమల్ లో నటిస్తున్న విషయం తెల్సిందే. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రణబీర్ సరసన రష్మిక మందన్నా నటిస్తోంది.
టి సిరీస్, భద్రకాళి పిక్చర్స్‌పై ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఎట్టకేలకు సెట్స్ మీదకు వెళ్ళింది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ యానిమల్ చిత్రం ఈరోజు పూజా కార్యక్రమాలతో లాంచ్ అయింది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నేడు హిమాలయాల్లో ప్రారంభమైంది. ఇక ఈ సినిమా షూటింగ్ కోసం కొత్త పెళ్ళికొడుకు హిమాలయాలకు చెక్కేశాడు. షూటింగ్ మొదలైన దగ్గర నుంచి తొలి షెడ్యూల్ పూర్తయ్యే వరకూ గ్యాప్ లేకండా రణబీర్ షూట్లో పాల్గొంటారట.. ఇక రణబీర్ తో పాటు ఈ షూట్ లో రష్మిక కూడా జాయిన్ కానుంది. రణబీర్ కపూర్ మరియు సందీప్ రెడ్డి వంగాల క్రేజీ కాంబినేషన్ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అందుకు తగ్గట్టుగానే సందీప్ ఈ కథను తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. మరి సందీప్ వంగా.. రణబీర్ ని ఏ రేంజ్ లో చూపిస్తాడో చూడాలి.
